వైరల్‌ తూకిత్తా .. మైకిత్తా.. అంటున్న చేపలు

25 May, 2021 20:55 IST|Sakshi

సముద్ర జలాలపై హక్కుల కోసం ప్రపంచ దేశాలు కొట్టుకుంటున్నాయి. .. కావేరి నదీ జలాల వినియోగం విషయంలో తమిళనాడు, కర్నాటకలు కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నాయి. ఆఖరికి మంచినీటి కొళాయి దగ్గర కుమ్ములాటలు మనందరికీ సుపరిచితమే. రెండు వర్గాల మధ్య క్షణాల్లో మంటలు పుట్టించగల శక్తి నీటి సొంతం. ఆ శక్తి ఎలాంటిదంటే  నిత్యం నీటిలో ఉండే చేపలు  సైతం గొడవలు పెట్టుకునేంత. రెండు సముద్రపు చేపలు ఒకదానిపై మరొకటి దుమ్ముత్తి పోసుకుంటున్న వీడియో ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. బయటి ప్రపంచంలో నీరు లేక గొడవలు జరుగుతుంటే నీటిలో ఉండి కూడా చేపలు పౌరుషంగా పొట్లాటకు దిగడం చూపరులను ఆకట్టుకుంటోంది

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు