ఎగురుతున్న హెలికాప్టర్‌పై పులప్స్‌

7 Aug, 2022 02:27 IST|Sakshi

సాధారణ పుషప్స్, పులప్స్, చేయాలంటేనే ఎంతో ఫిట్‌నెస్‌ కావాలి. ఇక ఎగురుతున్న హెలికాప్టర్‌కు వేలాడుతూ పులప్స్‌ చేయడమంటే.. ఫిట్‌నెస్‌ ఫ్రీక్స్‌ అయి ఉండాలి. రికార్డుల పిచ్చయినా ఉండాలి. అలాంటి సాహసాన్ని చేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును సాధించారు డచ్‌ ఫిట్‌నెన్‌ ఇన్‌ఫ్లూయెర్స్‌ స్టాన్‌ బ్రూనింక్‌. యూట్యూబ్‌లో ఫిట్‌నెస్‌ చానల్‌తో స్టాన్‌ బ్రౌనీగా పాపులర్‌ అయిన బ్రూనింక్‌... అతని కోహోస్ట్‌–ఆర్జెన్‌ ఆల్బర్స్‌.. ఇద్దరూ బెల్జియమ్, ఆంట్‌వెర్ప్‌లోని హోవెనన్‌ ఎయిర్‌ఫీల్డ్‌లో గిన్నిస్‌ అధికారుల సమక్షంలో వరల్డ్‌ ఫీట్‌ కోసం ప్రయత్నించారు.

నిమిషానికి 25 పులప్స్‌తో బ్రూనింక్‌ రికార్డును నెలకొల్పాడు. అది కూడా రెండు సార్లు. ఇక మొదట 24 పులప్స్‌ చేసిన ఆల్బర్స్‌ అంతకుముందు 23 పులప్స్‌తో ఉన్న ఓ రోమెనియన్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. తరువాత బ్రూనింక్‌ 25 పులప్స్‌తో ఆ రికార్డునూ బద్దలు కొట్టాడు. ఎగురుతున్న హెలికాప్టర్‌... విపరీతమైన గాలి, భయంకరమైన ధ్వని. అది ఊగుతూ ఉంటే.. దానికి వేలాడుతూ పులప్స్‌ చేసి, ఇద్దరూ సాహసమే చేశారు. ఇలా కదులుతున్న వాహనాల మీద సాహసాలు చేసిన రికార్డులు గతంలోనూ ఉన్నాయి. 1 నిమిషం 30 సెకన్లలో కదులుతున్న కారు టైర్‌ మార్చి రికార్డు నెలకొల్పగా.. అంతకంటే తక్కువ సమయం 1నిమిషం 13 సెకన్లలోనే మార్చేసి.. ఆ రికార్డును బ్రేక్‌ చేశారు ఇద్దరు ఇటాలియన్లు.   

మరిన్ని వార్తలు