కరోనా లేదన్నాడు, దానికే బలయ్యాడు

19 Oct, 2020 09:00 IST|Sakshi

కైవ్‌: కరోనా వైరస్‌ బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది మరణిస్తున్నారు. అయితే ఇప్పటికి చాలా మందిలో కరోనా వైరస్‌కు సంబంధించి అపోహలు ఉన్నాయి. ఇది ఆరోగ్య ఉన్న వారిని ఏం చేయలేదని, ఫిట్‌గా ఉన్న వారి దరిదాపుల్లోకి  కూడా రాదని భావిస్తున్నారు. వచ్చిన వారంలో కోలుకోవచ్చని కూడా చాలామంది తప్పుడు ప్రచారాలు చే​స్తున్నారు. అయితే ఈ వైరస్‌ సోకి యుక్త వయసులో ఉన్నవారు కూడా చాలామంది మరణించిన ఉదంతాలు కోకొల్లలు. తాజాగా ఉక్రేన్‌కు చెందిన 33 ఏళ్ల ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్, దిమిత్రి స్టుజుక్ కోవిడ్‌ -19 బారిన  పడి మరణించారు. ఒకప్పుడు ఆయన తన అనుచరులకు కరోనా వైరస్‌ లేదని సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం  చేశారు. అయితే ఆయనే కరోనా మహమ్మారి సోకి మరణించారు. ఈ విషయాన్ని దిమిత్రి  మాజీ భార్య సోఫియా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో స్టుజుక్ మరణ వార్తను ధ్రువీకరించింది.

ఇక కరోనా బారిన  పడిన దిమిత్రి తాను కరోనా బారిన పడేంత వరకు అది ఉందని అసలు నమ్మలేదని  చనిపోయే ముందు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. కరోనా వైరస్‌ ఇప్పట్లో అంతం కాదని, అది చాలా బలమైందని పేర్కొన్నారు. టర్కీకి వెళ్లినప్పుడు దిమిత్రికి తీవ్రమైన కడుపునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. అనంతరం తన దేశానిక తిరిగి రాగానే కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆయన డిశార్జ్‌ అయ్యి ఇంటికి వచ్చారు. తరువాత ఉన్నట్టుండి ఆయన పరిస్థితి విషయం కావడంతో మళ్లీ ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.  దిమిత్రికి 1.1 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు.     చదవండి: ఐజీని కబళించిన కరోనా మహమ్మారి

మరిన్ని వార్తలు