మరో 80 ఏళ్లలో మాల్దీవులు మాయం..!

8 Jun, 2021 14:28 IST|Sakshi

2100 నాటికి మాల్దీవులు సహా మరో నాలుగు దీవులు మాయం

మనదేశంలో సెలబ్రిటీల ఫెవరెట్‌ హాలీడే స్పాట్‌ అంటే టక్కున గుర్తుకు వచ్చేది మాల్దీవులు. మరీ ముఖ్యంగా బీటౌన్‌ లవ్‌ కపుల్స్‌కి మాల్దీవులంటే మహా ఇష్టం. ఇక హీరో, హీరోయిన్లు ఏమాత్రం గ్యాప్‌ దొరికినా చాలు.. మాల్దీవుల్లో వాలిపోతారు. కొత్తగా పెళ్లైన బడాబాబులు హానీమూన్‌ ట్రిప్‌ కోసం కూడా మాల్దీవులనే సెలక్ట్‌ చేసుకుంటారు. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద దీరుతూ.. ఏంజాయ్‌ చేస్తూ.. రోజువారి ఒత్తిడి నుంచి దూరమయ్యి.. రిఫ్రెష్‌ అయ్యి వస్తారు.

అయితే మాల్దీవ్స్‌ లవర్స్‌కి ఓ బ్యాడ్‌ న్యూస్‌. మరో 80 ఏళ్లలో అనగా 2100 నాటికి మాల్దీవులు మాయమవుతాయట.. అంటే పూర్తిగా నీటిలో మునిగిపోతాయని నివేదిక వెల్లడించింది. మాల్దీవ్స్‌, ఫిజితో పాటు మరో మూడు అందమైన దీవులు నీటిలో మునిగిపోతాయంటున్నారు శాస్త్రవేత్తలు. రానున్న 60 ఏళ్లలోపు ఈ ద్వీపాలు నీటిలో మునిగిపోతాయని, గ్లోబల్ వార్మింగ్ వల్లనే ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

గ్లోబల్ వార్మింగ్ వల్ల పెరుగుతున్న సముద్ర మట్టం
40 వ దశకంలో, అమెరికన్ శాస్త్రవేత్త బెనో గుటెన్‌బర్గ్ సముద్రంలో నీరు పెరుగుతున్నట్లు అనుమానించి.. ఒక అధ్యయనం చేశాడు. దీన్ని ధ్రువీకరించుకోవడానికి గుటెన్‌బర్గ్ గత 100 సంవత్సరాల డేటాను అధ్యయనం చేశాడు. అతని అనుమానం నిజమని తేలింది. ధృవాల వద్ద మంచు కరగడం వల్ల సముద్రంలో నీటి మట్టం నిరంతరం పెరుగుతోందని గుటెన్‌బర్గ్‌ గమనించాడు. 90 వ దశకంలో, నాసా కూడా దీనిని ధ్రువీకరించింది. అప్పటి నుంచి, గ్లోబల్ వార్మింగ్ వల్ల తలెత్తే​ సమస్యల ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చర్చ ప్రారంభమయ్యింది. 

2100 నాటికి మాయమవనున్న మాల్దీవులు
సముద్రపు నీరు వేగంగా పెరగడం వల్ల 2100 చివరి నాటికి మాల్దీవులు నీటిలో మునిగిపోతాయని ప్రపంచ బ్యాంక్, అనేక ఇతర సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.

ఫిజీ కూడా ముప్పు
అందమైన బీచ్‌లతో తయారైన ఫిజీ, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. ఫిజీలో అనేక మంది భారతీయులు నివసిస్తున్నారు. అయితే సముద్ర మట్టం పెరగడం వల్ల భవిష్యత్తులో ఈ అందమైన దేశం కూడా నీటిలో మునిగిపోతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు.

ఏటా పెరుగుతున్న సముద్ర నీటి మట్టం
పలావు, పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. నీటి మట్టం పెరగడం వల్ల సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఎదుర్కొనబోతుంది. పలావు నేషనల్ వెదర్ సర్వీస్ ఆఫీస్ అండ్‌ పసిఫిక్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ ప్రోగ్రాం ప్రకారం 1993 నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ సముద్రపు నీరు 0.35 అంగుళాల చొప్పున పెరుగుతోంది.

ఇప్పటికే నీట మునుగుతున్న రిపోసోలోమోన్ ద్వీపం
రీడర్స్ డైజెస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం, రిపోసోలోమోన్ ద్వీపం దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఇది సుమారు 1000 ద్వీపాలు ఉంటాయి. ఇవి ఇప్పుడు నీటిలో మునిగిపోతున్నాయి అని తెలిపారు శాస్త్రవేత్తలు. 

చదవండి: ఇండియాకు మాల్దీవులు షాక్‌.. అయోమ‌యంలో బీటౌన్ లవ్‌బ‌ర్డ్స్‌

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు