సినీఫక్కీలో దోపిడీ: జస్ట్‌ 60 సెకన్లలో 7 కోట్ల విలువైన కార్లను కొట్టేశారు: వీడియో వైరల్‌

7 Dec, 2022 12:55 IST|Sakshi

సినిమాలో చూస్తుంటాం అత్యంత ఖరీదైన లగ్జరీ కార్టు కొట్టేయడం. నిజ జీవితంలో కాస్త రిస్క్‌. కానీ ఈ ఘటన చూస్తే ఇంత సులభంగా కొట్టేయొచ్చా అని నోరెళ్లబెట్టడం మనవంతు అవుతుంది. ఇక్కడొక దొంగల ముఠా కేవలం 60 సెకన్లలో చకచక సుమారు రూ. 7 కోట్లు ఖరీదు చేసే కార్లను కొట్టేశారు.

వివరాల్లోకెళ్తే...ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్‌ కౌంటీలో ఈ హైటెక్‌ దోపిడి ఘటన చోటు చేసుకుంది. కొంతమంది దొంగలు ఇంగ్లాండ్‌లోని థురోక్‌ బరో గ్రామంలో బ్రెంట్‌వుడ్‌ రోడ్‌ సమీపంలోని ఓ కాంపౌండ్‌లోకి చోరబడ్డారు. అక్కడ ఉన్న ఐదు లగ్జరీ కార్లను సినిమాలోని హీరోల మాదిరి ఎత్తుకెళ్లారు. ఆ దొంగల్లో ఒక వ్యక్తి గేటు తీసి సాయం చేస్తే మిగతా దొంగలు ఆ కార్లను ఎంచక్కా...డ్రైవ్‌ చేసుకుంటూ జస్ట్‌ 60 సెకన్లలో గప్‌చుప్‌గా కొట్టేశారు.

సుమారు రూ. ఏడు కోట్లకు పైగా విలువ చేసే మొత్తం ఐదు లగ్జరీ కార్లను ఎత్తుకెళ్లారు. వాటిలో రెండు పోర్ష్‌లు, మెర్సిడెస్‌లు కాగా, ఒక మేబ్యాక్‌ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అందుకు సంబంధించిన ఘటన మొతం అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డు అవ్వడంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 

(చదవండి: వాటే ఐడియా! స్కూటర్‌ సాయంతో నిర్మాణ పనులు)

మరిన్ని వార్తలు