తలపాగే ప్రాణాలను కాపాడింది

20 Oct, 2021 11:22 IST|Sakshi

కెనడా: మనం వెళ్లున్నప్పుడో లేక ఎక్కడకైన వెళ్లినపుడు  అనుకోకుండా అప్పటి వరకు మనతో ఉన్న వాళ్లకు ఏదైనా ప్రమాదం జరిగితే మనకు ఏం చేయాలో కూడా తెలియదు. వాళ్లను ఏ విధంగా రక్షించాలన్న ఆలోచనతో గందరగోళంలోకి వెళ్లిపోతాం. మహా అయితే ఎవరినైన సాయం చేయమని అడుగుతాం తప్ప మన వరకు మనం ఏదైనా చేయగలమా అన్న ఆలోచనే స్ఫూరించదు. కానీ కెనడాలోన ఒక పార్కులోని ఇద్దరూ వ్యక్తులు పార్క్‌ దగర ఉండే నీటిలో పడిపోతే వారిని ఐదుగురు సిక్కులు తమ వద్ద రక్షించేందకు కావల్సినవి ఏమి లేకపోయినప్పటికీ  వాళ్లు తలపాగనే తాడుగా చేసి మరీ వాళ్లను కాపాడతారు. 

(చదవండి: బీరు’బలి.. ఒక్కపనితో హీరో అయ్యాడు)


వివరాల్లోకెళ్లితే....కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని గోల్డెన్ ఇయర్స్ ప్రావిన్షియల్ పార్క్‌లో కుల్జీందర్ కిండా అనే అతను తన స్నేహితుడితో కలిసి వాకింగ్‌ చేస్తూ అనుకోకుండా ఇద్దరూ అక్కడ ఉన్న జారుడు బడ్డ మీద నుంచి సమీపంలోని జలపాతంలోకి పడిపోతారు. దీంతో ఆ పార్క్‌లో ఉన​ ప్రజలు ఇద్దరూ వ్యక్తులు ఎవరో పడిపోయారు కాపాడంటూ అని అరుస్తారు. అటుగా  వాకింగ్‌ చేస్తూ వస్తున్న ఐదుగురు సిక్కు స్నేహితులు ఏం జరిగిందని అక్కడి వాళ్లని అడిగి తెలుసుకుంటారు.

ఈ మేరకు వాళ్లను ఏ విధంగా రక్షించాలో మొదట వాళ్లకు అర్థం కాలేదు . ఇంతలో తమ తలపాగనే తాడుగా చేసి రక్షింద్దాం అనే నిర్ణయానికి వస్తారు వాళ్లు. ఈ క్రమంలో ఆ ఐదుగురు స్నేహితులు తమ తలపాగలను, ఆఖరికి తమ దుస్తులను కూడా జత చేసి తాడుగా మార్చి వారిని రక్షించే ప్రయత్నం చేస్తారు. కొతసేపటి వాళ్లు సురక్షితంగా బయటపడతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. దీంతో నెటిజన్లు ఏమి ఆలోచన మీది, మీరు చాలా గ్రేట్‌  అంటూ రకరకాలుగా ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు

(చదవండి: ఏంటీ....స్నేక్‌ కేక్‌ ఆ!)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు