శ్రీలంకలో ఆకస్మిక వరదలు.. నలుగురు మృతి

5 Jun, 2021 18:01 IST|Sakshi

కొలంబో: శ్రీలంకలో ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో ఐదు వేల మంది నిరాశ్రయులవడమేగాక ఇప్పటివరకు నలుగురు మృతి చెందారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. హిందూ మహాసముద్రంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో గురువారం రాత్రి నుంచి శ్రీలంకలో ఆరు జిల్లాల్లో  భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి అనేక ఇళ్ళు, వరి పొలాలు, రోడ్లు నీటిలో మునిగిపోయాయి. వరదల ధాటికి ఇద్దరు చనిపోగా.. కేగల్లే జిల్లాలో ఒక ఇంటిమీద మట్టిపెళ్లలు విరిగిపడడంతో మరో ఇద్దరు చనిపోయారు. కాగా సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌ గ్రామానికి చేరుకొని మట్టిపెళ్లలు తొలగించి మృతదేహాలను బయటకి తీశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 5వేల మంది నిరాశ్రయులు కావడంతో వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. 
చదవండి: వరదలో చిక్కిన మహిళ.. సహాయక సిబ్బంది తెగువతో..

మరిన్ని వార్తలు