కుక్క కంటే మనిషి కరిస్తేనే..ఇంత దారుణంగా ఉంటుందా? కోలుకోవడానికే..

9 Jun, 2023 16:19 IST|Sakshi

కుక్క కరిస్తే ఎంత ప్రమాదమో అని అందరికీ తెలుసు. అందుకే అది కరిచిన వెంటనే ర్యాబిస్‌ వ్యాధి రాకుండా ఇంజెక్షన్‌లు తీసుకుంటాం. కొద్ది రోజులు ఆహార నియమాలు పాటిస్తాం. అయితే కుక్క కాటు కంటే మనిషి కరిస్తేనే అత్యంత ప్రమాదకరమట. ఆ వ్యక్తి కోలుకోవడానికే ఆరు నెలల పడుతుందట. ఔను! ఈ విచిత్ర ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది.

అసలేం జరిగందంటే..డోని ఆడమ్స్‌ ఫిబ్రవరిలో టంపా బేలో ఒక కుటుంబ కార్యక్రమానికి వెళ్లాడు. అక్కడ చిన్న గొడవ జరిగింది. దీంతో ఇద్దరు బంధువులు కలబడ్డారు. వారిని విడదీసేందకు మధ్యలో కలగజేసుకున్న ఆడమ్స్‌ని ఒక వ్యక్తి కోపంతో మోకాలిపై కరిచాడు. దీంతో అతను నైక్రోటైజింగ్‌ షాసిటిస్‌ వ్యాధి బారినపడ్డాడు. దీనిని సాధారణంగా మాంసం తినే భ్యాక్టీరియా అని పిలుస్తారు. దీని కారణంగా శరీరీం కుళ్లిపోతూ ఇన్ఫెక్షన్‌కు గురై చనిపోతాడు.

ఈ వ్యాధి నెమ్మదిగా చర్శంలోకి ప్రవేశించి కండరాల తొడుకు ఉండే ఆరోగ్యకరమైన కణజాలాన్ని నాశనం చేస్తుంది. పాపం ఆ ఘటన కారణంగా ఆడమ్స్‌ ఆస్పత్రికి సందర్శించాల్సి వచ్చింది. అక్కడ వైద్యలు ఈ విషయాన్నే ఆడమ్స్‌ తెలిపారు. వెంటనే శస్త్ర చికిత్స చేయలని లేదంటే ప్రాణాంతకమని చెప్పారు. కుక్క కాటు కంటే మనిషి కాటు ఎంత ప్రమాదమో వైద్యులు అతనికి వివరించి చెప్పారు.

శస్త్ర చికిత్సలో ఆడమ్స్‌కి 70 శాతం కణజాలాన్ని తొలగించాల్సి వచ్చింది. ఈ శస్త్ర  చికిత్స త్వరిత గతిన చేయకపోతే గనుక ఆడమ్స్‌ కాలుని కోల్పోవలసి ఉండేది. అతను కోలుకోవడానికి మూడు వారాలు పడితే..పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టింది. దీంతో ఆడమ్స్‌ ఈ భయానక ఘటన నుంచి కోలుకునేలా చేసిన వైద్యులకు రుణపడి ఉంటానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆడమ్స్‌. కుక్క కాటు కన్న మనిషిక కాటు ఇంతా భయానకంగా ఉంటుందని తాను అస్సలు అనుకోలేదని వాపోయాడు. అందుక సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: ఛీ!.. ఇలానా కొబ్బరి బోండాలు విక్రయించేది..వీడియో వైరల్‌)

మరిన్ని వార్తలు