ఆమెకు అత్యంత‌ ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన సొర చేప

11 Aug, 2020 22:19 IST|Sakshi

ఫ్లోరిడా: భారీ సైజులో ఉండే సొర చేప‌ను చూస్తే సాధార‌ణంగానే భ‌యం వేస్తుంది. అలాంటిది దాని ద‌గ్గ‌ర వెళ్లి ఈత కొట్టాలంటే ఇంకెలా ఉంటుంది? గుండె ఆగినంత ప‌న‌వుతుంది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఇసో మ‌చాడో త‌న‌ కుటుంబం, స్నేహితుల‌తో క‌లిసి స‌ముద్రంలో షికారుకు వెళ్లింది. ఆ త‌ర్వాత అక్క‌డి ప‌డ‌వ‌లో నుంచి ఎంతో ఉత్సాహంగా స‌ముద్రంలోకి దూకింది. కానీ ఆమె సంతోషం ఎక్కువ‌కాలం నిల‌వ‌లేదు. ప‌డ‌వ‌కు, ఆమెకు మ‌ధ్య‌లో సొర‌చేప ప్ర‌త్య‌క్షం కావ‌డంతో ప‌డ‌వ‌లో ఉన్న ఆమె కొడుకు ఆంథోని భ‌యంతో అరుస్తూ సంకేతాలు ఇచ్చాడు. దీంతో అక్క‌డున్న జీవిని చూసేస‌రికి ఆమె ప్రాణం గ‌తుక్కుమంది. (ఇలాంటి అద్భుతాలు అరుదుగా జ‌రుగుతాయి)

అయితే ఆమె ప్రాణ‌భ‌యంతో ఎలాంటి కేక‌లు పెట్టకుండా నిశ్శ‌బ్ధంగా ఉండ‌టంతో‌ ఎనిమిది అడుగుల పొడ‌వున్న ఆ సొర చేప మ‌హిళ‌కు ద‌గ్గ‌ర‌గా వెళ్లిన‌ట్లే వెళ్లి తిరిగి త‌న దారిన అది వెళ్లిపోయింది. దీంతో ఆమె బ‌తుకుజీవుడా అని ఊపిరి పీల్చుకుంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. "చావును చాలా ద‌గ్గ‌ర నుంచి చూసింది", "టైం బాగుంది కాబ‌ట్టి స‌రిపోయింది", "పెద్ద ప్ర‌మాదం నుంచే త‌ప్పించుకున్నావు" అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. (షికారుకని వచ్చి షార్క్‌కు చిక్కాడు)

మరిన్ని వార్తలు