ఫ్లూ టీకాతో ఆ రెండు జబ్బులు తగ్గుదల..

29 Jul, 2020 19:23 IST|Sakshi

న్యూఢిల్లీ: ఫ్లూ టీకాతో గుండె జబ్బులు, అల్జిమర్స్‌(మతిమరుపు) వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని అమెరికన్‌ హర్ట్‌ అసోసియేషన్‌ అధ్యయనం తెలిపింది. ఇటీవల కరోనా నియంత్రించేందుకు ఫ్లూ వ్యాక్సిన్‌ ఉపయోగపడుతుందని నిపుణులు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నివేదికలో ఆశ్యర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా ఒక ఫ్లూ వ్యాక్సిన్‌తో 17శాతం, మరో  ఫ్లూ వ్యాక్సిన్‌తో 13శాతం అల్జీమర్స్‌ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని నివేదిక తెలిపింది.

మరోవైపు 65, 75 సంవత్సరాల వయస్సుల వారికి నిమోనియా టీకాలు వాడడం వల్ల 40శాతం అల్జీమర్స్‌ వ్యాధి తగ్గిందని తెలిపింది.  ఎవరైతే బాల్యంలో ఫ్లూ వ్యాక్సిన్‌ తీసుకున్నారో వారికి రోగనిరోధక శక్తి అధికంగా ఉందని, జన్యుపరమైన ఇబ్బందులు లేనివారికి ఈ వ్యాక్సిన్‌ అద్భుతంగా పనిచేస్తుంది. ఫ్లూ వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి తీవ్ర గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం 28శాతం తగ్గుతుందని, 73శాతం మంది చనిపోయే ప్రమాదం నుంచి గట్టెక్కుతారని నివేదిక పేర్కొంది.   

మరిన్ని వార్తలు