‘సారీ మీ ఫుడ్‌ తినేశా.. చాలా టేస్టీగా ఉంది’.. డెలివరీ బాయ్‌ నిర్వాకం

31 Oct, 2022 19:49 IST|Sakshi

లండన్‌: ప్రస్తుత రోజుల్లో ఇంటికే ఫుడ్‌ డెలివరీ చేస్తున్నాయి పలు ఆన్‌లైన్‌ సంస్థలు. రోజుకు లక్షల మంది ఆయా యాప్‌ల ద్వారా తమకు ఇష్టమైన ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకుంటున్నారు. మంచి ఆకలితో ఉన్నప్పుడు ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకున్నాక.. ఇంటి కాలింగ్‌ బెల్‌ మోగితే డెలివరీ బాయ్‌ వచ్చాడేమోనని ఆత్రుతగా పరుగెడతాం. కాదని తెలిస్తే ఒక్కసారిగా కోపం పెరిగిపోతుంది. ఫుడ్‌ డెలివరీ బాయ్‌ ఆలస్యంగా వచ్చినా చికాకుతో ఊగిపోతాం. అలాంటి సంఘటనే యూకేలోని ఓ వ్యక్తికి ఎదురైంది. అయితే, ఇక్కడ ఆలస్యం కాలేదు. అసలు తాను ఎదురుచూస్తున్న ఫుడ్‌ తీసుకురాలేదు కదా తాపీగా సారీ అంటూ ఓ మెసేజ్‌ చేశాడు ఫుడ్‌ డెలివరీ బాయ్‌. ఆ తర్వాత ఏం జరిగింది?

లియమ్‌ బ్యాగ్నాల్‌ అనే వ్యక్తి ‘డెలివెరూ’ అనే ఫుడ్‌ డెలివరీ యాప్‌లో తనకు ఇష్టమైన ఫుడ్‌ ఆర్డర్‌ చేశాడు. డెలివరీ కోసం ఎదురుచూడశాగాడు. కొద్ది సేపటి తర్వాత తన ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. అది ఫుడ్‌ డెలివరీ ఏజెంట్‌ ‘సారీ’ అంటూ పంపించాడు. దానికి బ్యాగ్నాల్‌ ఏం జరిగిందని రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత ‘ఈ ఫుడ్‌ చాలా రుచికరంగా ఉంది. దానిని నేను తినేశాను. మీరు డెలివెరూ కంపెనీకి రిపోర్ట్‌ చేయండి’అని రిప్లై ఇచ్చాడు డెలివరీ బాయ్‌. ఆ తర్వాత నువ్‌ భయంకరమైన మనిషివి అని లియామ్‌ పేర్కొన్నాడు. దానికి ‘ఐ డోంట్‌ కేర్‌’ అంటూ షాకిచ్చాడు. ఈ సంభాషణ స్క్రీన్‌ షార్ట్స్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు లియామ్‌. ట్విట్టర్‌ పోస్ట్‌కు 192వేల లైక్స్‌ వచ్చాయి. వేలాది మంది కామెంట్లు చేశారు.

ఇదీ చదవండి: దేవుడే పంపాడేమో! మంటల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడిన వ్యక్తి

మరిన్ని వార్తలు