ఇదేం రూల్‌ సామి.. భార్య బర్త్‌డే మర్చిపోతే.. జైళ్లో పడేస్తారా !

23 Nov, 2021 19:01 IST|Sakshi

దేశానికో భాష ఉన్నట్లే చట్టాలు కూడా ఒక్కో దేశానికి ఒక్కోలా ఉంటాయి. సాధారణంగా ప్రజలు చేసే తప్పులకు కొన్ని దేశాల్లో అక్కడి చట్టాలనుసరించి క‌ఠినంగా వ్యవహరిస్తే మరికొన్ని వాటిలో అవే తప్పులకు కాస్త వెసలుబాటును కల్పిస్తుంటాయి. ఇప్పుడిదంతా ఎందుకంటారా.. సమెవా అనే ప్రాంతంలో ఓ వింత చట్టం అమలవుతోంది. ఆ చట్టాన్ని వింటే ఎవరైనా షాక్‌ అవ్వాల్సిందే.

వివరాల్లోకి వెళితే.. ప‌సిఫిక్ సముద్రం సమీపంలో ఉన్న స‌మోవా అనే ఓ ఐలాండ్‌లో ఉంది. ఆ ఐలాండ్ ఎంత అందంగా ఉంటుందో అక్కడి ఉండే చ‌ట్టాలు కూడా చాలా క‌ఠినంగా ఉంటాయి. తాజాగా.. అక్కడ భర్తలు తమ భార్య పుట్టిన రోజును మర్చిపోతే జైలు శిక్ష అనుభవించాలని అక్కడి ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకువచ్చింది. సతీమణి పుట్టినరోజును పొరపాటున మర్చిపోతే కూడా అక్కడ నేరంగా పరిగణిస్తారట. అయితే ఈ విషయంలో భార్య ఫిర్యాదు కీలకం. ఆమె ఫిర్యాదు చేస్తే మొదట సారి పోలీసులు హెచ్చరించి వదిలేస్తారు.

అదే మళ్లీ పునరావృతం అయితే రెండో సారి జైలు శిక్ష తప్పదు. భార్యపై నిర్ళక్ష్యం చూపకూడదే ఉద్దేశ్యంతో అక్కడి ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇటీవల చైనా కూడా పిల్లలు తప్పు చేస్తే వారి తల్లిదండ్రులను శిక్షించాలని ఓ చట్టాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

చదవండి: Guinness World Record: ఎంత బిగుతైన గడ్డామో! 63 కేజీల యువతిని ఎత్తాడు..!!

మరిన్ని వార్తలు