క్యూబా అధ్యక్షుడి సంచలన ఆరోపణలు.. ఖండించిన ఎక్స్‌ పోర్న్‌ స్టార్‌

17 Jul, 2021 08:28 IST|Sakshi

ఎక్స్‌-పోర్న్‌స్టార్‌, ప్రయుఖ వెబ్‌కామ్‌ మోడల్‌ మియా ఖలీఫా మరోసారి వార్తల్లోకి నిలిచింది. క్యూబా అల్లకల్లోలంపై ఆమె చేసిన పోస్ట్‌తో రాజకీయపరమైన విమర్శలు మొదలయ్యాయి. ఏకంగా క్యూబా అధ్యక్షుడు మిగ్యుయెల్‌ దిజాయ్‌-కనెల్‌ ఆమెపై విరుచుకుపడ్డాడు. మియాను ఓ క్యారెక్టర్‌లేని పర్సనాలిటీగా పేర్కొన్న మిగ్యుయెల్‌..  ఆమె ఒక అమెరికా పెయిడ్‌ ఏజెంట్‌ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆమె స్పందించింది.

‘ప్రజల పట్ల మానవత్వం లేకుండా ప్రదర్శిస్తున్న మీ తీరును ఇతరులకు తెలియజేయాలనే ఆ పని చేశా. నేనేం డబ్బులు తీసుకుని ఆ పని చేయలేదు. ఏ ప్రభుత్వం కూడా నాకు ఆ పని అప్పజెప్పలేదు. నా పరిధిలో ఉచితంగా ఆ ట్వీట్‌ చేశా’ అంటూ ట్వీట్‌ ద్వారా బదులిచ్చింది ఆమె. అంతేకాదు క్యూబా అయినా, పాలస్తీనా అయినా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడమే నా పని అంటూ మరో ట్వీట్‌ ద్వారా పేర్కొంది. 

ఇదిలా ఉంటే క్యూబా ప్రజల ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు బైడెన్‌ మద్దతు తెలిపిన రోజే.. మియా ఖలీఫా ట్వీట్‌ చేసింది. దీంతో మీడియా ప్రతినిధులు క్యూబా అధ్యక్షుడు మిగ్యుయెల్‌ దగ్గర ఆమె ప్రస్తావన తీసుకురావడంతో ‘ఆమె అమెరికా చేతిలో కీలు బొమ్మ. క్యారెక్టర్‌ లేని వ్యక్తి. పెయిడ్‌ ఏజెంట్‌’ అంటూ ఆయన విరుచుకుపడ్డాడు. ఇక మియాకు ఇలా ఇన్‌న్యూస్‌ విషయాలపై కొత్తేం కాదు. గతంలో పాలస్తీనా విషయంలో అమెరికా తప్పుల్ని సైతం వెలేత్తి చూపించిందామె. సోషల్‌ మీడియాలో భారీగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఈ లెబనీస్‌-అమెరికన్‌ సెలబ్రిటీ.. తరచూ కొందరికి సాయం అందించడంతో పాటు ఇలా వివాదాల్లో కూడా నిలుస్తోంది.

మరిన్ని వార్తలు