మృత్యువుతో పోరాడి ఓడిన షింజో అబే.. జపాన్‌ మాజీ ప్రధాని కన్నుమూత

8 Jul, 2022 14:38 IST|Sakshi

టోక్యో: జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే(67) కన్నుమూశారు. మృత్యువుతో పోరాడి ఆయన ఓడిపోయారని జపాన్‌ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సాయుధుడైన దుండగుడి కాల్పుల్లో గాయపడ్డ అబేను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి.. కాపాడేందుకు వైద్యులు శాయశక్తుల ప్రయత్నించారని జపాన్‌ ప్రధాని కాసేపటి క్రితం ప్రకటించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించి పోవడంతో ఆయన్ని కాపాడడం వీలు కాలేదని అధికారులు ప్రకటించారు. 

శుక్రవారం ఓ సభలో ఆయన ప్రసంగిస్తుండగా.. దుండగులు రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఘటనాస్థలంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరోవైపు షింజోను కాపాడే ప్రయత్నం చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.

మరిన్ని వార్తలు