బాలాకోట్‌ దాడి: సంచలన విషయాలు వెల్లడి

9 Jan, 2021 20:44 IST|Sakshi

ఇస్లామాబాద్‌: దాయాది దేశం కుట్ర పన్ని చేసిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత సీఆర్‌పీఎఫ్‌ సైనికులు అసువులు బాసిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా భారత్‌ బాలకోట్‌ ఉగ్రస్థావారలపై ఎయిర్‌ స్ట్రైక్స్‌ నిర్వహించింది. ఇక నాటి దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదులు మరణించినట్లు కేంద్రం ప్రకటించింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇవ్వన్ని గాలి మాటలే.. అంతమంది చనిపోతే.. రక్తం ఎక్కడ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌ మాజీ దౌత్యవేత్త ఓ టీవీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. (చదవండి: దేశమంతా శోకంలో ఉంటే నీచ రాజకీయాలా?)

ఓ ఉర్దు చానెల్‌ డిబెట్‌లో పాక్‌ దౌత్యవేత్త ఆఘా హిలాలీ మాట్లాడుతూ.. ‘భారతదేశం అంతర్జాతీయ సరిహద్దును దాటి.. ప్రతీకార చర్యలకు పూనుకుంది. ఈ ఘటనలో కనీసం 300 మంది మరణించారు. ఇందుకు మేం బదులు తీర్చుకుంటాం. కానీ మా లక్ష్యం వేరు. మేం వారి హై కమాండ్‌ని టార్గెట్‌ చేశాం. అది మా చట్టబద్ధమైన లక్ష్యం. ఇక మేం సర్జికల్‌ దాడులు జరిగాయి కానీ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ప్రకటించాం. వారు ఎంత నష్టం కలిగించారో.. మేం కూడా అంతే నష్టం వారికి కలగజేస్తాం. ఎక్కువ చేయం’ అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు