Pope Benedict XVI Death: రిటైర్డ్‌ పోప్‌ బెనెడిక్ట్‌-16 కన్నుమూత

31 Dec, 2022 15:53 IST|Sakshi

వాటికన్‌ సిటీ: పోప్‌ బాధ్యతల నుంచి కొన్నేళ్ల క్రితం తప్పుకున్న బెనెడిక్ట్‌-16 కన్నుమూశారు. 95 ఏళ్ల బెనెడిక్ట్‌ అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచినట్లు వాటికన్‌ అధికారులు ప్రకటించారు. ‘పోప్ ఎమెరిటస్, బెనెడిక్ట్ 16 ఈ రోజు వాటికన్‌లోని మేటర్ ఎక్లేసియా మొనాస్టరీలో ఉదయం 9:34 గంటలకు కన్నుమూశారని బాధతో మీకు తెలియజేస్తున్నాను’అని ఓ ప్రకటన విడుదల చేశారు వాటికన్‌ ప్రతినిధి మాటియో బ్రూనీ. 

2013లో పోప్‌ బాధ్యతల నుంచి తప్పుకుని అందరినీ ఆశ్యర్చానికి గురిచేశారు బెనెడిక్ట్‌16. అప్పటి నుంచి వాటికన్‌ గ్రౌండ్స్‌లోని కాన్వెంట్లో నివసిస్తున్నారు. ఆయన అసలు పేరు జోసెఫ్ రాట్జింగర్. మాజీ పోప్‌లకు రూల్‌బుక్ లేనప్పటికీ, బెనెడిక్ట్ అంత్యక్రియలు ఫ్రాన్సిస్ అధ్యక్షతన వాటికన్‌లో జరగాలని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: పంజా విసురుతోన్న కోవిడ్‌ ‘సూపర్‌ వేరియంట్‌’.. అంత ప్రమాదకరమా?

మరిన్ని వార్తలు