నిరసనకారులను కాల్చి చంపేయమని ఆదేశించిన ట్రంప్‌

3 May, 2022 15:08 IST|Sakshi

'Can't you just shoot them?': అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పై ఎన్నో వివాదాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ట్రంప్‌ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కూడా విచిత్రమైన నిర్ణయాలతో వివాదస్పదమైన నాయకుడిగా ముద్ర వేయించుకున్నాడు. ఇప్పుడు తాజాగా ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దూకుడుగా వ్యవహరించిన మరో అంశం వెలుగులోకి వచ్చింది. ఈ నేపధ్యంలో  మే 2020లో జార్జ్ ఫ్లాయిడ్‌ అనే నల్లజాతీయుడుని మిన్నియా పాలిస్ పోలీసు సిబ్బంది చేతుల్లో హత్యకు గురైన నాటి సంగతి తెరపైకి వచ్చింది. నాటి నల్లజాతీయుడి హత్యనంతరం నిరసనలు వెల్లువెత్తడంతో ట్రంప్‌ నిరసనకారులను అణిచివేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపాడు.

పైగా వారిపై కాల్పులు జరపమని మిలటరికీ ఆదేశాలు జారీ చేశాడని అమెరికా మాజీ రక్షణ కార్యదర్శి మార్క్‌ ఎస్సర్‌ తాను రాసిన పుస్తకంలో తెలిపాడు. నాటి ఘటనలో సైన్యానికి అన్ని పవర్‌లు ఇచ్చేలా అత్యంత అరుదుగా ఉపయోగించే 200 ఏళ్ల నాటి తిరుగుబాటు చట్టాన్ని అమలు చేయడానికి యత్నించాడని కూడా రాశారు. అంతేగాక తాను వ్యతిరేకించినందుకుగానూ ట్రంప్‌ తనని పదవి నుంచి తొలగించినట్లు కూడా వెల్లడించారు. ఈ మేరకు నాటి రక్షణ కార్యదర్శి మార్క్‌ ఎస్సర్‌ తాను రాసిన ‘ఎ సేక్రేడ్ ఓత్’ అనే పుస్తకంలో ట్రంప్‌తో నాటి జ్ఞాపకాలను వివరించాడు. జనరల్‌ క్యాబినెట్ సభ్యులచే సమీక్షించబడిన ఈ పుస్తకం మే 10న విడుదల కానుంది.
(చదవండి: దాదాపు 2 లక్షల మంది ఉక్రెయిన్ పిల్లలను రష్యాకి తరలింపు)

మరిన్ని వార్తలు