ఉక్రెయిన్‌లోని భారత వైద్య విద్యార్థుల అగచాట్లు! కాలినడన పోలాండ్‌ సరిహద్దులకి పయనం

25 Feb, 2022 19:15 IST|Sakshi

Indian Medical Students Walk 8 km To Poland Border: ఉక్రెయిన్‌ రష్య యుద్ధ బీభత్సం నుంచి తప్పించుకునేందుకు వైద్యా విద్యార్థులు ప్రాణాలను అరచేత పట్టుకుని  కాలినడకన పోలాండ్‌ సరిహద్దుల వెంబడి పయనమయ్యారు. ఈ మేరకు సరిహద్దుకు సుమారు 8 కి.మీ దూరంలో తమ కళాశాల బస్సు నుంచి దిగిన 40 మంది వైద్యా విద్యార్థులు ఉక్రెయిన్‌ నుంచి పోలాండ్‌ సరిహద్దుకు  వెళ్లారని స్థానిక మీడియా తెలిపింది. పోలాండ్‌ సరిహద్దుకు సుమారు 70 కి.మీ దూరంలో ఉన్న ఎల్వివ్‌లోని ఒక వైద్య కళాశాల విద్యార్థులు ఉక్రెయిన్‌ విడిచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.

రష్యా బలగాలు ఇప్పటికే రాజధాని కైవ్‌లోని అడుగు పెట్టేయడమే కాక అక్కడ ఉన్న ఉక్రెయిన్‌ డిఫెండర్లతో పోరాడుతున్నాయి. మరో రెండు గంటల్లో నగరం రష్యా అధినంలోకి వచ్చే అవకాశం ఉందని ఉక్రెయిన పశ్చిమ పరిశీలకులు చెబుతున్నారు. దీంతో భారత వైద్య విద్యార్థుల పోలాండ్‌-ఉక్రెయిన్ సరిహద్దు వరకు సుదీర్ఘ నడకను సాగించారు. అంతేకాదు కొంతమంది విద్యార్థుల తాము ఉక్రెయిన్‌ని విడిచి కాలినడకన ఒక సముహంగా వెళ్తున్నట్లు సోషల్‌ మీడియాలో పోస్టుల కూడా పెట్టారు.  

ఉక్రెయిన్‌లో దాదాపు 16 వేల మంది భారతీయులు ఉన్నారు, పైగా వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. రష్యా బాంబు దాడులు, క్షిపిణి దాడుల భయంతో భూగర్భ మెట్రో స్టేషన్లు, నేల మాళిగలు వంటి షెల్టర్ల నుంచి చాలా మంది సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఎల్వివ్, చెర్నివ్ట్సీలలో క్యాంపు కార్యాలయాలను ప్రారంభించింది. పోలాండ్‌కు వెళ్లే భారతీయ విద్యార్థులకు సహాయం చేసేందుకు ఇండియన్‌ ఎంబసీ మరింత మంది రష్యన్ మాట్లాడే అధికారులను ఈ క్యాంపు కార్యాలయాలకు పంపింది.

విద్యార్థుల బృందం ఉక్రెయిన్-రొమేనియా సరిహద్దుకు కూడా బయలుదేరిందని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ పొరుగు దేశాలకు చేరుకోగలిగిన భారతీయుల కోసం ప్రభుత్వం  విమానాలను పంపించడమే కాక ఈ ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేకాదు రెండు చార్టర్డ్ విమానాలు ఈరోజు బుకారెస్ట్‌కు బయలుదేరే అవకాశం ఉందని ఒక విమానం రేపు బుడాపెస్ట్‌కు బయలుదేరుతుందని వెల్లడించారు. హంగరీ, రొమేనియాలోని సరిహద్దు చెక్ పాయింట్‌లకు దగ్గరగా ఉన్నవారు ముందుగా బయలుదేరాలని సూచించారు. విద్యార్థి కాంట్రాక్టర్లతో టచ్‌లో ఉండాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ విద్యార్థులను కోరింది.

(చదవండి: ఉక్రెయిన్ ఉక్కు మహిళ! మా గడ్డ పై ఏం పని మీకు ?)

మరిన్ని వార్తలు