ప్రధాని మోదీకి నిరసన సెగ: నలుగురి మృతి

27 Mar, 2021 11:13 IST|Sakshi

ఢాకా: స్వాతంత్ర్యం సిద్ధించి 50 వసంతాలు కావడంతో బంగ్లాదేశ్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ శుక్రవారం బంగ్లాదేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బంగ్లాదేశ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్‌లో నిరసన సెగ తగిలింది. నరేంద్ర మోదీ పర్యటనకు నిరసనగా కొందరు ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలు దాడి చేయడంతో నలుగురు మృతిచెందారు. 

బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌ నగరంలో నిరసనకారులను చెదరగొట్టేందుకు రబ్బర్‌ బుల్లెట్లు వినియోగించారు. దీంతో పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమించి మృతిచెందారు. చిట్టగ్యాంగ్‌లో శుక్రవారం నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వారి ఆందోళన హింసాత్మకంగా మారింది. సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లోకి చొచ్చుకొచ్చారు. దీంతో పోలీసులు విధిలేక బాష్ప వాయువు, రబ్బర్‌ బుల్లెట్లు ప్రయోగించారు. దీంతో ఆందోళనకారులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ రబ్బర్‌ బుల్లెట్ల ధాటికి నలుగురు మృత్యువాత పడ్డారు. అయితే నరేంద్ర మోదీ దేశ రాజధాని ఢాకాలో పర్యటించగా అక్కడ కూడా కొందరు నిరసన చేపట్టడం గమనార్హం. ఓ మతానికి చెందిన వారు ఈ ఆందోళనలు చేపట్టారు. దీనికి కారణం తెలియాల్సి ఉంది.

చదవండి: నా టీనేజ్‌లో బంగ్లాదేశ్‌ కోసం కొట్లాడాను
చదవండి: 10 మంది సజీవ దహనం: నన్ను క్షమించండి..

మరిన్ని వార్తలు