అమెరికాపై ఫ్రాన్స్‌ ఆగ్రహం

19 Sep, 2021 06:20 IST|Sakshi

పారిస్‌: సాంప్రదాయక జలాంతర్గాముల కొనుగోలు వ్యవహారం అమెరికా, ఫ్రాన్స్‌ ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 66 బిలియన్‌ డాలర్ల విలువైన 12 డీజిల్‌–ఎలక్ట్రిక్‌ జలాంతర్గాముల కొనుగోలుకు సంబంధించి 2016లో ఆస్ట్రేలియా ఫ్రాన్స్‌తో భారీ కొనుగోలు ఒప్పందం కుదర్చుకుంది. అయితే,  అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల కొత్త ‘ఆకస్‌’ కూటమి పరోక్షంగా ఈ కొనుగోలు ఒప్పందం రద్దుకు దారితీసింది.

సంప్రదాయక జలాంతర్గాములు ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేయబోమని, ఆ ఒప్పందాన్ని రద్దుచేసుకుంటున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్‌ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌కు లేఖ రాశారు. ఫ్రాన్స్‌కు బదులుగా అమెరికా నుంచి అత్యాధునిక అణు జలాంతర్గాములను ఆస్ట్రేలియా కొనుగోలుచేయనుంది. తమతో ఒప్పందం రద్దుకు అమెరికానే ప్రధాన కారణమని ఫ్రాన్స్‌ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇందుకు  నిరసన అమెరికాలో తమ రాయబారి ఫిలిప్‌ ఎతీన్‌ను ఫ్రాన్స్‌ వెనక్కి పిలిపించింది. ఆస్ట్రేలియా వైఖరిని తూర్పారబడుతూ అక్కడి తమ రాయబారి జీన్‌ పియర్‌ థబాల్ట్‌ను ఫ్రాన్స్‌ వెనక్కి పిలిపించింది.
 

మరిన్ని వార్తలు