పాకిస్తాన్‌కు ఫ్రాన్స్‌ షాక్‌

21 Nov, 2020 04:42 IST|Sakshi

మిరేజ్‌ యుద్ధవిమానాల్ని ఆధునీకరించకూడదని నిర్ణయం

రెండు దేశాల మధ్య క్షీణిస్తున్న సంబంధాలు

పారిస్‌: పాకిస్తాన్‌కు ఫ్రాన్స్‌ ప్రభుత్వం గట్టి షాక్‌ ఇచ్చింది. ఆ దేశానికి గతంలో విక్రయించిన మిరేజ్‌ యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థ, అగోస్టా 90బీ జలాంతర్గాములను ఆధునీకరించకూడదని  ఫ్రాన్స్‌  నిర్ణయించింది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ తీరును తప్పుపడుతూ పాక్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ తరచుగా ప్రకటనలు చేస్తున్నారు. తమ దేశంలో ఇస్లామిక్‌ ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేస్తామని మేక్రాన్‌ ప్రకటించడమే ఇందుకు కారణం. పాక్‌ తీరుతో ఆగ్రహంతో ఉన్న ఫ్రాన్స్‌  మిరేజ్‌ యుద్ధ విమానాలను అప్‌గ్రేడ్‌ చేయరాదని నిర్ణయానికి వచ్చింది. ఖతార్‌కు ఫ్రాన్స్‌ రఫేల్‌ ఫైటర్‌ జెట్లను విక్రయించింది. ఈ జెట్ల సర్వీసింగ్‌కు పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న నిపుణులకు నియమించరాదని ఖతార్‌ను ఆదేశించింది.   ఆశ్రయం కోరుతూ పాకిస్తాన్‌ పౌరుల నుంచి అందుతున్న విజ్ఞప్తులను ఫ్రాన్స్‌ పక్కనపెడుతోంది. 

మరిన్ని వార్తలు