గూగుల్‌కు భారీ జరిమానా

8 Jun, 2021 10:54 IST|Sakshi

ఆన్‌లైన్‌ అడ్వర్‌టైజింగ్‌లో ఆధిపత్య ఆరోపణలు

ఫ్రెంచ్‌ యాంటీ ట్రస్ట్‌ భారీ జరిమానా

 గ్లోబల్‌ యాడ్‌  మోడల్‌ను మార్చేందుకు గూగుల్‌ సమ్మతి

ప్యారిస్‌: ఆన్‌లైన్‌ అడ్వర్‌టైజింగ్‌లో ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలపై టెక్‌ దిగ్గజం గూగుల్‌కు ఫ్రాన్స్‌ 220 మిలియన్‌ యూరోల (268 మిలియన్ల  డాలర్లు) జరిమానా విధించింది. పోటీ సంస్థలను దెబ్బతీసే తరహా విధానాలను కంపెనీ పాటించిందని ఫ్రాన్స్‌ గుత్తాధిపత్య నియంత్రణ సంస్థ కాంపిటీషన్‌ అథారిటీ నిర్ధారించింది. జరిమానా విధించిన నేపథ్యంలో గూగుల్‌ తన విధానాలను మార్చుకుంటే పోటీదారులందరికీ సమాన అవకాశాలు లభించగలవని కాంపిటీషన్‌ అథారిటీ పేర్కొంది. ఈ వివాదాన్ని సెటిల్‌ చేసుకునేందుకు కంపెనీ మొగ్గు చూపిందని తెలిపింది. రూపర్ట్‌ మర్డోక్‌కి చెందిన న్యూస్‌ కార్ప్, ఫ్రాన్స్‌ పేపర్‌ గ్రూప్‌ లె ఫిగారో, బెల్జియంకి చెందిన రోసెల్‌ లా వాయిస్‌ తదితర సంస్థలు ఆరోపణలు చేసిన మీదట గూగుల్‌పై కాంపిటీషన్‌ అథారిటీ విచారణ జరిపింది. దీనిపై స్పందించిన గూగుల్‌ జరిమానా చెల్లించడానికి అంగీకరించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా దాని వ్యాపార విధానాన్ని మార్చేందుకు సమ్మతించింది. 

చదవండి : stockmarket: సెన్సెక్స్,నిఫ్టీ కన్సాలిడేషన్‌
నైకీ, హెచ్‌అండ్‌ఎం బ్రాండ్స్‌కు చైనా షాక్‌
బీపీవో ఉద్యోగాలు..ఏపీ నుంచే అత్యధికం

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు