అండర్‌వాటర్‌లో మ్యూజియం

16 Mar, 2021 15:31 IST|Sakshi

జల్పం!జాసన్‌ డి టేలర్‌... అండర్‌వాటర్‌ మ్యూజియమ్‌ల సృష్టికర్తగా ప్రసిద్ధుడు. మెక్సీకో నుంచి మాల్దీవుల వరకు ఎన్నో అండర్‌ వాటర్‌ మ్యూజియమ్‌ లను సృష్టించాడు. ఈ బ్రిటీష్‌ శిల్పకారుడు తాజాగా ఫ్రాన్స్‌లోని లెర్నెస్‌ ద్వీపాలలో జలగర్భ మ్యూజియంను ఆవిష్కరించాడు. ఇందులో మొత్తం ఆరు భారీ విగ్రహాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఆరు ఆడుగుల ఎత్తు, పది టన్నుల బరువు ఉంటుంది. వీటిని తయారు చేయడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. ఇవేమీ ప్రముఖుల విగ్రహాలు కాదు. 9 సంవత్సరాల స్కూలు పిల్లాడి నుంచి ఎనభై సంవత్సరాల జాలరి శిల్పాల వరకు ఇందులో ఉన్నాయి.

మరిన్ని వార్తలు