క​రోనా బారిన పడిన ఫ్రెంచ్‌ ప్రెసిడెంట్‌

17 Dec, 2020 15:46 IST|Sakshi
ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్(ఫైల్‌ ఫొటో)

పారిస్‌ : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (42) కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వైరస్‌ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాటిజివ్‌గా నిర్థారణ అయింది. దీంతో మాక్రాన్‌ వారంపాటు ఐసోలేషన్‌లో ఉండనున్నారు. ఈ మేరకు ఎలీసీ ప్యాలెస్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ​కాగా ఫ్రాన్స్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో వారం పాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. ఇక కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి దేశంలో ఇప్పటివరకు రెండు మిలియన్ల మందికి వైరస్‌ సోకింది. మహమ్మారి బారిన పడి  59,400 మందికి పైగా మరణించారు.(చదవండి: ఫ్రాన్స్‌లో భద్రతా బిల్లుపై జనాగ్రహం)

Poll
Loading...
మరిన్ని వార్తలు