Covid New Wave: వేల సంఖ్యలో కోవిడ్‌ కేసులు.. మరో వేవ్‌కు సంకేతమా? ఈ సూచనలు తప్పనిసరి!

22 Jun, 2022 21:06 IST|Sakshi

పారిస్‌: కరోనా పీడ ఇప్పట్లో విరగడయ్యేలా కనిపించడం లేదు. ప్రపంచాన్ని పట్టి కుదిపేసిన కోవిడ్‌ మహమ్మారి మరోసారి పంజా విసిరేలా ఉంది. పలు దేశాల్లో రోజురోజుకూ పెరుగుతున్న కేసులు ఈ భయాలను మరింత పెంచుతున్నాయి. తాజాగా ఫ్రాన్స్‌లో కోవిడ్‌ తీవ్ర రూపు దాల్చేలా ఉందని ఫ్రెంచ్‌ వ్యాక్సినేషన్‌ చీఫ్‌ అలేన్‌ ఫిష్చర్‌ అన్నారు. ఫ్రాన్స్‌-2 టెలివిజన్‌తో బుధవారం ఆయన మాట్లాడారు.

నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయని, ఇది మరో వేవ్‌కు సంకేతమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం ఇదేమాదిరిగా అధిక కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. మహమ్మారి మరోసారి విజృంభిస్తుందనడంలో సందేహం లేదని చెప్పారు. అయితే, కొత్త వేరియంట్లతో కూడిన తాజా వేవ్‌ తీవ్రత ఎలా ఉంటుందన్నదే అసలైన సవాల్‌ అని వ్యాఖ్యానించారు. 
ఐసీయూలో వెంటిలేటర్‌పై పాక్‌ దిగ్గజ క్రికెటర్‌

భౌతిక దూరం పాటించడం, జనం గుంపులోకి వెళ్లినప్పుడు మాస్కు ధరించడం తప్పనిసరి అని సూచించారు. ఇతర యూరప్‌ దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా పోర్చుగల్‌లో రెండు ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లు బీఏ.4, బీఏ.5 వెలుగుచూశాయని తెలిపారు. కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లతో వ్యాధి తీవ్రత తక్కువగానే ఉంటున్నట్టు తెలిపారు. అయితే, వ్యాప్తిలో వేగం ఉండటం ఆందోళన కలిగించే అంశమని చెప్పుకొచ్చారు. కాగా, మంగళవారం ఒక్కరోజే ఫ్రాన్స్‌లో 90 వేలకు పైగా కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి.
వీడెవడ్రా బాబు! ఇలా వెళ్తున్నాడు.. తేడా కొడ్తే అంతే సంగతులు

మరిన్ని వార్తలు