జర్మనీ అధ్యక్షునిగా మళ్లీ స్టెయిన్‌మెయర్‌

14 Feb, 2022 06:02 IST|Sakshi

మరో ఐదేళ్లు పదవిలో కొనసాగింపు

బెర్లిన్‌:  జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్‌ వాల్టర్‌ స్టెయిన్‌మెయర్‌ (66) మరో ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. పార్లమెంటు ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై ఆయన్ను మరోసారి అధ్యక్షునిగా ఎన్నుకుంది. అధికార పక్షంతో పాటు అత్యధిక విపక్షాలు కూడా ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు పలికాయి. మాజీ చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ హయాంలో స్టెయిన్‌మెయర్‌ రెండుసార్లు విదేశాంగ మంత్రిగా పని చేశారు. జర్మనీలో అధ్యక్ష పదవి లాంఛనప్రాయమైనది. 

మరిన్ని వార్తలు