‘నేను బతికే ఉన్నాను.. గుర్తించండి’

12 Jan, 2021 14:26 IST|Sakshi

పారిస్‌: బతికి ఉన్న మనిషిని చనిపోయారని ప్రకటిస్తే.. ఎంత బాధగా ఉంటుందో అనుభవించే వారికే తెలుస్తుంది. సాధారణంగా మన దగ్గర యూట్యూబ్‌ చానెళ్లు.. అప్పుడప్పుడు మీడియా సంస్థలు కూడా బతికి ఉన్న మనుషులను చనిపోయారని ప్రకటించి.. ఆ తర్వాత నాలుక కర్చుకుంటాయి. ఇక మన ప్రభుత్వ సంస్థల నుంచి పెన్షన్‌ లాంటివి పొందాలంటే అధికారులు మనం బతికి ఉన్నామనే సర్టిఫికెట్‌ తీసుకురమ్మాంటారు. చెట్టంత మనిషి ఎదురుగా ఉంటే నమ్మరు.. స్టాంప్‌ వేసిన కాగితం తెచ్చిస్తేనే.. మనం బతికి ఉన్నామనడానికి నిదర్శనం అని నమ్ముతారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఫ్రాన్స్‌లో చోటు చేసుకుంది. ఓ 58 ఏళ్ల మహిళ తాను బతికే ఉన్నానని.. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరుతూ.. కోర్టు మెట్లు ఎక్కింది. 

జీన్ పౌచైన్ అనే మహిళ తాను బతికి ఉన్నానని గుర్తించండి అంటూ 2017 నవంబర్‌ నుంచి ప్రభుత్వ సంస్థలను కోరుతుంది. ఆ వివరాలు.. జాన్‌ ఫౌచెన్‌ అనే మహిళ చనిపోయిందంటూ ఆమె భర్తతో పాటు పని చేసిన ఓ ఉద్యోగి ప్రభుత్వానికి తెలియజేశాడు. దాంతో అధికారులు ఆమెకు సంబంధించిన డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఐడీ కార్డ్‌, బ్యాంక్‌ అకౌంట్‌ వంటి రికార్డులను శాశ్వతంగా తొలగించారు. ఆమె ఉద్యోగం కూడా కోల్పోయి.. ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు కారణం ఏంటి అంటే ఫౌచైన్, ఆమె భర్త, కుమారుడు‌ పని చేస్తున్న క్లీనింగ్‌ కంపెనీ 2000 సంవత్సరంలో ఓ పెద్ద కాట్రాంక్ట్‌ కోల్పోయింది. ఆ తర్వాత 2004లో కార్మిక ట్రిబ్యునల్‌ ఫౌచైన్‌ 14 వేల యూరోల నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే అదృష్టవశాత్తు కేసు సంస్థపై రిజిస్టర్‌ కావడంతో ఫౌచైన్‌ బతికి పోయిది. ఈ క్రమంలో సదరు మాజీ ఉద్యోగి ఇదే కేసులో ఫౌచైన్‌ భర్త, కుమారుడి మీద కేసు నెగ్గడం కోసం ఆమె మరణించింది అంటూ ఫేక్‌ పత్రాలను సమర్పించాడు. దాంతో అధికారులు ఆమెకు సంబంధించిన రికార్డులను శాశ్వతంగా తొలగించారు. మాజీ ఉద్యోగి ఫౌచైన్‌పై రెండుసార్లు కేసు పెట్టడానికి ప్రయత్నించాడు కాని ఫలించలేదు. (చదవండి: వెలుగులోకి 100 ఏళ్లనాటి పావురాయి సందేశం)

ఈ సందర్భంగా ఫౌచైన్‌ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ‘ఇది ఒక మతిలేని కేసు. అధికారులు ఎలాంటి దర్యాప్తు, ఆధారాలను తనిఖీ చేయకుండా ఆమె చనిపోయిందని ప్రకటించారు. ఒక్కరు కూడా క్రాస్‌ చెక్‌ చేసుకోలేదు’ అంటూ మండిపడ్డారు. మనికొందరు మాత్రం కాంట్రాక్ట్‌ లాస్‌ కేసులో నుంచి బయటపడటం కోసం ఫౌచైన్‌ తప్పుడు పత్రాలు సృష్టించిందని ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యల్ని ఆమె ఖండించారు. ‘నేను మరణించలేదని.. సంస్థలు తెలుపుతున్నాయి.. అలా అని నేను బతికి ఉన్నానని కూడా ప్రకటించడం లేదు. ఈ ప్రకటన చేయించడం కోసం నేను ఫైట్‌ చేస్తున్నాను’ అంటూ ఫౌచైన్‌ ఆవేదన వ్యక్తం చేస్తోంది. 

మరిన్ని వార్తలు