తలకిందులుగా రావడంపై అసహనం

11 Feb, 2021 16:35 IST|Sakshi

అమెరికాలో కరోనాతో ఇబ్బంది పడ్డ ప్రజలకు ఓ ప్యాకేజీ ప్రకటిద్దామని అధికారులు నిర్ణయం తీసుకుని దానిపై చర్చించేందుకు జూమ్‌ యాప్‌ను ఉపయోగించారు. జూమ్‌ యాప్‌లో మాట్లాడుతున్న సమయంలో జరిగిన ఓ చిన్న సంఘటన వైరల్‌గా మారింది. తలకిందులుగా ప్రసారమవడంతో ఓ కాంగ్రెస్‌ సభ్యుడు అసహనం వ్యక్తం చేశారు. ‘తానేం పిల్లిని కాను’ అని తలకిందులుగా వచ్చిన ఫొటోను స్క్రీన్‌షాట్‌ తీసి ట్వీట్‌ చేశారు. దీనికి నెటిజన్లు పలువిధాలుగా కామంట్స్‌ చేస్తున్నారు. 

యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ కరోనాతో బాధపడుతున్న ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటుపై చర్చా సమావేశం జూమ్‌ యాప్‌లో నిర్వహించింది. సభ్యులు, అధికారులతో కలిసి ఆన్‌లైన్ జూమ్ యాప్ కేంద్రంగా సమావేశం నిర్వహించగా ఈ సమయంలో చిన్న తప్పిదం జరిగింది. కాంగ్రెస్ సభ్యుడు టామ్ ఎమ్మర్ మాట్లాడుతుండగా వీడియో తలకిందులుగా ప్రసారమైంది. దీంతో టామ్ ఎమ్మర్ కూడా తలకిందులుగా కనిపించాడు.

దీన్ని చూసిన అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు మీరు బాగానే ఉన్నారు కదా..? అని ప్రశ్నించారు. ‘ఇలా ఎందుకు వస్తుందో తనకు తెలియదని, దీనిని ఒకసారి ఆపివేసి, తిరిగి మళ్లీ ప్రారంభిస్తా’ అని చెప్పారు. దీనిపై ఆయన అసహనానికి గురయ్యాడు. వెంటనే స్క్రీన్‌షాట్‌ తీసుకుని దాన్ని ట్విటర్‌లో పంచుకున్నాడు. ‘తాను తలకిందులుగా వేలాడడానికి పిల్లిని కాదు’ అని ట్వీట్‌ చేశాడు.
 

>
మరిన్ని వార్తలు