మానవ కార్యకలపాలతో అధిక ముప్పు

30 Oct, 2020 14:56 IST|Sakshi

సంచలన విషయాలు వెల్లడించిన ఐపీబీఈఎస్‌ నివేదిక

జెనీవా: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ ప్రారంభమయ్యి దాదాపు ఏడాది కావస్తోంది. దీనిని అరికట్టే వ్యాక్సిన్‌ ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు మరికొన్ని ఆందోళన కలిగించే అంశాలను వెల్లడించారు. వైరస్‌ల‌ విజృంభణ కరోనాతోనే ఆగలేదు.. భవిష్యత్తులో మరిన్ని వైరస్‌లు మానవుల మీద దాడి చేయనున్నాయి అని తెలిపారు. అవి కోవిడ్‌ కన్నా ఇంకా భయంకరంగా ఉండనున్నాయి అని తెలిపారు. ప్రకృతిలో మానవుల మీద దాడి చేయగల వైరస్‌లు 9లక్షల వరకు ఉన్నాయని వెల్లడించారు.

అంటువ్యాధులతో వ్యవహరించే విధానంలో కూడా భారీ మార్పులు రాబోతున్నట్లు తెలిపారు. ప్రకృతి క్షీణత, పెరుగుతున్న మహమ్మారి ప్రమాదాల మధ్య సంబంధాలపై దృష్టి సారించిన ఇంటర్‌ గవర్నమెంటల్ సైన్స్-పాలసీ ప్లాట్‌ఫాం ఆన్‌ బయోడైవర్శిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ (ఐపీబీఈఎస్‌) ఏర్పాటు చేసిన వర్క్‌షాప్ గురువారం నివేదిక విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 22 మంది ప్రముఖ నిపుణులు దీనిలో పాల్గొన్నారు. వీరంతా కలిసి జీవివైవిధ్యం, మహమ్మారిపై ఈ నివేదికలో చర్చించారు. నివేదికలోని అంశాలు ఇలా ఉన్నాయి. 

ప్రకృతిలో 9లక్షల వైరస్‌లు మానవులపై దాడి చేస్తాయి
కోవిడ్ -19 కి కారణమయ్యే వైరస్ అయిన సార్స్‌-కోవ్‌-2 గురించి భయపడేవారికి, ప్రకృతిలో 5,40,000 - 8,50,000 తెలియని వైరస్‌లు ప్రజలకు సంక్రమించగలవని నివేదిక హెచ్చరించింది. ఆసక్తికర అంశం ఏంటంటే ఫ్రెంచ్ గయానాలో మాయరో వైరస్ వ్యాధి వ్యాప్తి చెందిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నివేదించిన మూడు రోజుల తరువాత ఈ నివేదిక వెలువడటం గమనార్హం. డెంగ్యూ లాంటి లక్షణాలతో ఉన్న ఈ వైరస్ కూడా దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఎబోలా, జికా, నిపా ఎన్సెఫాలిటిస్ వంటి అభివృద్ధి చెందుతున్న వ్యాధులలో ఎక్కువ భాగం (70శాతం), ఇన్‌ఫ్లూయెంజా, హెచ్ఐవీ / ఎయిడ్స్, కోవిడ్ -19 వంటి జూనోటిక్‌ వ్యాధులకు మూలం జంతువుల మీద ఉండే సూక్ష్మజీవులు. వన్యప్రాణులు, పశుసంపద, ప్రజల మధ్య సంబంధాలు ఉండటంతో ఈ  సూక్ష్మజీవులు వ్యాధులను వ్యాపింపజేస్తున్నాయని ఐపీబీఈఎస్‌ నివేదిక తెలిపింది. వర్క్‌షాప్‌లో, మహమ్మారి బారి నుంచి తప్పించుకోవడం సాధ్యమే అని నిపుణులు అంగీకరించారు. అందుకు గాను ప్రతిచర్య నుంచి నివారణ వరకు వరకు భారీ మార్పులు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. (కరోనా చాలా కాలం ఉంటుంది : డబ్ల్యూహెచ్‌ఓ వార్నింగ్‌ )

కోవిడ్‌ 6వ ప్రపంచ ఆరోగ్య మహమ్మారి
1918 నుంచి గమనించినట్లయితే ప్రపంచాన్ని వణికించిన మహమ్మారులలో కోవిడ్‌ది ఆరవ సస్థానం. వీటిలో గ్రేట్‌ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ మొదటిది. ఇక దీని మూలాలు కూడా జంతువులలోని సూక్ష్మజీవులలోనే ఉన్నాయి. అయితే అన్ని మహమ్మారుల ఆవిర్భావం, వ్యాప్తి పూర్తిగా మానవ కార్యకలాపాల వల్లనే జరిగింది అని తెలిపింది. క్షీరదాలు, పక్షులలో ప్రస్తుతం కనుగొనబడని 1.7 మిలియన్ల వైరస్‌లు ఉన్నాయని, వీటిలో 8,50,000 వరకు ప్రజలకు సోకే సామర్థ్యం ఉందని నివేదిక తెలిపింది. "కోవిడ్‌ మహమ్మారి - లేదా ఏదైనా ఆధునిక మహమ్మారి వంటి వాటి వెనక గొప్ప రహస్యం ఏమి లేదు" అని ఎకో హెల్త్ అలయన్స్ అధ్యక్షుడు, ఐపీబీఈఎస్‌ వర్క్‌షాప్ పప్రెసిడెంట్‌ డాక్టర్ పీటర్ దాస్జాక్ ఒక ప్రకటనలో తెలిపారు. (చాలా దేశాలు ప్రమాదంలో ఉన్నాయి: డబ్ల్యూహెచ్‌వో)

మానవ కార్యకలపాలతో అధిక ముప్పు
"వాతావరణ మార్పు, జీవవైవిధ్య నష్టానికి కారణమయ్యే  మానవ కార్యకలాపాలు కూడా మహమ్మారి ప్రమాదాన్ని పెంచుతాయి. భూమిని ఉపయోగించే విధానంలో మార్పులు, వ్యవసాయం విస్తరణ, తీవ్రత; స్థిరమైన వాణిజ్యం, ఉత్పత్తి, వినియోగం ప్రకృతికి విఘాతం కలిగిస్తాయి. వన్యప్రాణులు, పశుసంపద, మానవుల మధ్య సంబంధాన్ని పెంచుతాయి. ఫలితంగా మహమ్మారి వ్యాప్తికి మార్గం సుగమం అవుతుంది. జీవవైవిధ్యానికి నష్టం కలిగించే మానవ కార్యకలాపాలను తగ్గించడం, అధిక జీవవైవిధ్య ప్రాంతాల దోపిడీని తగ్గించే చర్యల ద్వారా మహమ్మారి ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఇది వన్యప్రాణుల-పశువుల-మానవ సంబంధాలను తగ్గిస్తుంది. ఫలితంగా కొత్త వ్యాధుల వ్యాప్తిని నివారించడంలో సహాయపడుతుందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం వైరస్‌ కట్టడి కోసం అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌ వంటి నివారణ చర్యల కన్నా ఇది ఎంతో చవక అని.. పైగా ఎలాంటి ఆరర్థికపరమైన నష్టం వాటిల్లదని తెలిపుతుంది. (చదవండి: గాలి ద్వారా కరోనా.. !? )

"జూనోటిక్ వ్యాధుల్లో జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందే వైరస్‌లు ఇప్పటివరకు మనకు బహిర్గతం కాని కొత్త వైరస్లు. ఈ వైరస్‌లు మానవుల శరీరాలను అనుకూలంగా మార్చుకున్న తర్వాత  వ్యాప్తి చెందుతాయి. కోవిడ్ -19 వ్యాధికి కారణమయ్యే సార్స్‌-కోవ్‌-2 వైరస్ మన ముందున్న ఒక మంచి ఉదాహరణ. ఏ వైరస్ వేగంగా వ్యాపిస్తుందో మనం అస్సలు ఊహించలేము" అని న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మైక్రోబయాలజీ విభాగం మాజీ అధిపతి డాక్టర్ శోభా బ్రూర్ అన్నారు. (చదవండి: కోవిడ్‌ తిరగబెట్టదని గ్యారంటీ లేదు)

బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ ప్రొఫెసర్ డాక్టర్ మహేష్ శంకరన్ మాట్లాడుతూ, “భవిష్యత్తులో వైరస్‌ వ్యాధుల వ్యాప్తిలో 'సంపూర్ణ తుఫాను'ను సృష్టించడానికి భారతదేశం అనేక లక్షణాలను కలిగి ఉంది. ఎందుకంటే ఇక్కడ అధిక జీవవైవిధ్యం, అధిక జనాభా సాంద్రత, విస్తృతమైన భూ పరివర్తన, విచ్ఛిన్నం మానవ-వన్యప్రాణుల ఇంటర్ఫేస్ యొక్క పరిధిని పెంరగడం వంటి లక్షణాల వల్ల వైరస్‌ల వ్యాప్తి గణనీయంగా ఉండనుంది" అన్నారు.

మరిన్ని వార్తలు