ముగిసిన జీ-7 దేశాల సదస్సు

13 Jun, 2021 18:51 IST|Sakshi

బ్రిటన్ వేదికగా 3 రోజులపాటు జరిగిన జీ-7 సదస్సు

మానవ హక్కులను గౌరవించాలని చైనాకు జీ-7 సదస్సు పిలుపు

బ్రిటన్‌‌: బ్రిటన్ వేదికగా 3 రోజులపాటు జరిగిన జీ-7 సదస్సు నేటితో ముగిసింది. ప్రపంచానికి వ్యాక్సిన్ అందించడంలో సాయం చేయాలని సభ్య దేశాలు తీర్మానం చేశాయి. రోజు రోజుకి పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని సాంకేతికత సహాయంతో ఎదుర్కొంటామని ప్రకటించాయి. చైనాలో మానవ హక్కుల ఎక్కువ జరుగుతుండటంతో మానవ హక్కులను గౌరవించాలని చైనాకు జీ-7 సదస్సు వేదికగా పిలుపునిచ్చాయి. జీవవైవిధ్య నష్టాన్ని తగ్గించడానికి "నేచర్ కాంపాక్ట్" 2010కి సంబంధించి 2030 నాటికి కర్బన ఉద్గారాలను దాదాపు సగానికి తగ్గించడానికి కట్టుబడి కృషి చేస్తామని పేర్కొన్నాయి. 

"వీలైనంత త్వరగా" శక్తి కోసం స్వచ్ఛమైన బొగ్గును మాత్రమే ఉపయోగించేలా తప్పనిసరి చేయడం, పెట్రోల్, డీజిల్ కార్లను దశలవారీగా తొలగించడం వంటివి ఈ సదస్సులో నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రస్తుత జీ-7 కూటమి సదస్సుకు ఆస్ట్రేలియా, కొరియా రిపబ్లిక్, దక్షిణాఫ్రికాతో పాటు భారత్‌ను కూడా బ్రిటన్‌ ఆహ్వానించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలతో భావ సారూప్యం కలిగిన దేశాలను కలిపి ఉంచే ప్రయత్నంలో భాగంగా వీటిని జీ-7 సదస్సుకు అతిథ్య దేశాలుగా ఆహ్వానించారు. ఈ జీ-7 కూటమిలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా ఉన్నాయి.

చదవండి: పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయ‌డం ఎలా..?

మరిన్ని వార్తలు