1 మిలియన్‌ డాలర్ల పూచీకత్తుపై బెయిలు

8 Oct, 2020 12:05 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన ఆఫ్రో- అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతి కేసులో ప్రధాన నిందితుడైన పోలీస్‌ అధికారి డెరెక్ చౌవిన్‌కు బెయిలు మంజూరైంది. మిలియన్‌ డాలర్ల పూచీకత్తుతో స్థానిక కోర్టు అతడికి జైలు నుంచి విముక్తి కల్పించింది. కాగా మే 25న మినియాపోలిస్‌లో డెరెక్‌ ఛావెన్‌ అనే శ్వేతజాతీయుడైన పోలీస్‌, జార్జ్‌ను అరెస్ట్‌ చేసే క్రమంలో అతడి గొంతుపై గొంతుపై మోకాలితో తొక్కిపెట్టగా, ఊపిరి ఆడక అతడు మరణించిన విషయం తెలిసిందే. (చదవండి: ల‌వ్ యూ.. నేను చచ్చిపోతున్నా: ఫ్లాయిడ్ చివ‌రి క్ష‌ణాలు)

ఈ నేపథ్యంలో నల్ల జాతీయుడు జార్జ్‌ ప్లాయిడ్‌కు మద్దతుగా వేలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేయడంతో, అగ్రరాజ్యం ఆందోళనలతో అట్టుడికిపోయింది. జార్జ్‌ మృతికి కారణమైన చౌవిన్‌ను వెంటనే ఉరి తీయాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. ఈ క్రమంలో చౌవిన్‌తోపాటు మరో ముగ్గురు అధికారులపై కేసు నమోదైంది. ఇక ఈ నేరం రుజువైతే వాళ్లకు 12 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశముండగా.. చౌవిన్‌ బుధవారం బెయిలుపై విడుదలయ్యాడు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు