516కు పైగా ఆపరేషన్స్‌.. అయినా కానీ..

25 Oct, 2020 13:43 IST|Sakshi

అత్యధిక శరీర మార్పులు చేసుకున్న వ్యక్తిగా గిన్నీస్‌‌ రికార్డు

బెర్లిన్: వందల్లో శరీర మార్పులు చేసుకుని ఓ వ్యక్తి వరల్డ్‌ రికార్డు సృష్టించాడు. జర్మనీకి చెందిన రోల్ప్‌ బుచోల్జ్‌ దాదాపు 516కు పైగా బాడీ మోడిఫికేషన్స్‌‌ చేయించుకున్న వ్యక్తిగా వరల్డ్‌ గిన్నిస్‌ రికార్డుకు ఎక్కాడు. అయినప్పటికీ ఇంకా శరీరాన్ని మార్చడం పూర్తి కాలేదని చెప్పి రోల్స్‌ అందరిని ఆశ్చర్యపరిచాడు. రోల్ప్‌ 2010లో 453 ఆపరేషన్స్‌, పచ్చబొట్లు, ఇంప్లాంట్లు చేయించుకుని అత్యధిక సంఖ్యలో శరీరంపై కుట్లు వేసుకున్న వ్యక్తిగా గుర్తించారు. ఐదేళ్ల తర్వాత మరోసారి పలు మార్పులు‌ చేయించుకున్న రోల్స్‌ నుదుటిపై రెండు కొమ్ములు అమర్చుకుని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌కు ఎక్కాడు. (చదవండి: ఒక కారును ఇలా కూడా వాడొచ్చా!)

అనంతరం గిన్నిస్‌  వరల్డ్ వారు సోషల్‌ మీడియాలో రోల్స్‌ వీడియోలను షేర్‌ చేయడంతో వైరల్‌ అయ్యాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ ప్రకారం... రోల్ప్‌ జర్మనీలోని ఒక టెలికాం కంపెనీలో సమాచార సాంకేతిక పరిజ్ఞానం విభాగంలో పని చేస్తున్నాడు. అతడు 40 ఏళ్ళ వయసులో మొట్టమొదటి సారిగా పచ్చబొట్టు, ఆపరేషన్‌ చేసుకుని తన బాడీ మోడిఫికేషన్‌ ప్రారంభించాడు. అప్పటి నుంచి రోల్స్‌ తన పెదవులు, కనుబొమ్మలు, ముక్కు, నుదిటిపై రెండు చిన్న కొమ్ములతో పాటు 20 ఏళ్లుగా అనేక మార్పులు‌ చేయించుకున్నాడు. దీంతో రోల్స్‌ పూర్తిగా గుర్తుపట్టేలేనంతగా మారిపోయాడు. (చదవండి: వైరల్‌: ‘మీ మాట నమ్మిన.. కన్నతండ్రి లెక్క’)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు