ట్రూ లవ్‌.. ఆలస్యంగా నడిచిన 23 రైళ్లు 

30 Dec, 2020 13:18 IST|Sakshi

బెర్లిన్‌ : ప్రేమ అనేది మనుషులకు మాత్రమే కాదు జంతువులు, పక్షులకు కూడా ఉంటుంది. నిస్వార్థమైన ప్రేమను చూపడంలో మనుషుల కన్నా జంతువులే మిన్నగా ఉంటాయి. తాజాగా దీన్ని నిజం చేసే సంఘటన ఒకటి జర్మనీలో చోటు చేసుకుది. ఆ వివరాలు.. రెండు హంసలు హై స్పీడ్‌ రైల్వే లైన్‌లోకి దూసుకెళ్లాయి. ఈ క్రమంలో ఒక హంస ఒవర్‌హెడ్‌ పవర్‌ కేబుల్‌లో చిక్కుకుని మరణించింది. దాంతో మిగిలిన హంస రైల్వే ట్రాక్‌ మీదనే ఉండి చనిపోయిన భాగస్వామి శరీరాన్ని చూస్తూ.. బాధపడసాగింది. అధికారులు హంసను అక్కడి నుంచి తరిమే ప్రయత్నం చేసినప్పటికి అది కదలలేదు. దాదాపు 50 నిమిషాల పాటు అలా చనిపోయిన హంసను చూస్తూ.. బాధపడుతూ.. సంతాప సూచకంగా అక్కడే ఉండిపోయింది. దాని మూగ వేదనను అర్థం చేసుకున్న అధికారులు హంసను అలాగే ఉండనిచ్చారు. దాదాపు 50 నిమిషాల తర్వాత అగ్నిమాపక దళ సిబ్బంది వచ్చి చనిపోయని హంస మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించడంతో జంట హంస కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ 50 నిమిషాల పాటు ట్రాక్‌పై రాకపోకలు సాగకపోవడంతో  23 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. 

ఈ సంఘటనతో జంతువులు, పక్షులు కూడా ప్రేమ వంటి భావోద్వేగాలను కలిగి ఉండటమే కాక సున్నితంగా ఉంటాయని మరోసారి రుజువయ్యింది. అవి మనకంటే అధికంగా నొప్పిని అనుభూతి చెందుతాయిని నిరూపితమయ్యింది. అంతేకాక మనుషులు జంతువుల, పక్షులు వంటి మూగజీవుల పట్ల మరింత కరుణతో వ్యవహరించాలిన ఈ సంఘటన గుర్తు చేసింది. 

మరిన్ని వార్తలు