ఆమె చేతిలో ‘భర్త కావాలి’ బోర్డు.. 30 నిముషాల్లో మారిన సీన్‌!

12 Sep, 2023 11:53 IST|Sakshi

ఎవరైనాసరే తనకొక జీవిత భాగస్వామి కావాలని, సుఖదుఃఖాల్లో తోడుగా నిలవాలని కోరుకుంటారు. అయితే అందరికీ తగిన జీవిత భాగస్వామి లభించడం అంత సులభంకాదు. అనువైన జీవిత భాగస్వామిని దక్కించుకునేందుకు కొంత శ్రమించాల్సి వస్తుంది. ఇందుకోసం కొందరు డేటింగ్‌ యాప్‌లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఒక యువతి దీనికి భిన్నంగా కొత్త పద్ధతిని అనుసరించింది. అమెరికాలో రెండేళ్లుగా సింగిల్‌గా ఉంటున్న బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్‌ కరోలినా గీట్స్‌ భర్తను ఎన్నుకునేందుకు కొత్తగా ప్రయత్నించింది. 

కరోలీనాకు మంచి భార్త కావాలట. ఇందుకోసం ఆమె తన చేతులతో ఒక బోర్డు పట్టుకుని రోడ్డుపై నిలుచుంది. ఆ బోర్డుపై ‘భర్త కోసం వెదుకుతున్నాను’ అని రాసివుంది.ఈ బోర్డు పట్టుకుని ఆమె పట్టణంలో తిరుగుతోంది. సోహో పట్టణానికి చెందిన గీట్స్‌ మీడియాతో మాట్లాడుతూ తాను ఒక సైన్‌ బోర్టుపై ‘భర్త కోసం వెదుకుతున్నాను’ అని రాసి దానిని పట్టుకుని, పట్టణంలో తిరగాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. టిండర్‌, హింజ్‌ లాంటి డేటింగ్‌ యాప్‌ల ద్వారా కొందరు పురుషులతో స్నేహం చేసి, వాళ్లెవరూ నచ్చక తన టైమ్‌ వృథా చేసుకున్నానని ఆమె తెలిపింది. అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొంది. 

ఆమె పట్టణంలోని రోడ్లపై ఈ బోర్టు పట్టుకుని తిరుగుతుండగా 30 నిముషాల అనంతరం ఒక వ్యక్తి ఆమెకు తారసపడ్డాడు. దీంతో వారు ఫోన్‌ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. అనంతరం గీట్స్‌ మీడియాతో మాట్లాడుతూ భర్త కోసం వెదుకుతూ రోడ్డు మీదకు వచ్చిన 30 నిముషాలకు తనకు ఫలితం కనిపించిందని, ఇకపై తాము ఒకరికొకరు తెలుసుకోవాల్సి ఉందని, ఇప్పుడంతా కొత్తగా ఉందని, ఈ పరిచయం ఎక్కడికి దారితీస్తుందో చూడాలని అన్నారు. 
ఇది కూడా చదవండి: ఇంటి తవ్వకాల్లో పురాతన బాక్సు.. తెరిచి చూడగానే..

మరిన్ని వార్తలు