తమ్ముడి కోసం చిట్టితల్లి సాహసం

22 Jun, 2021 15:35 IST|Sakshi

ఇటీవల న్యూయార్క్​ బ్రోన్​క్స్​ వీధిలో జరిగిన ఓ  ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. న్యూయార్క్‌లో ఓ వ్యక్తిని వెంటాడుతూ ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. తుపాకి తుటా నుంచి తప్పించుకునే క్రమంలో ఆ వ్యక్తి ఎదురుగా వెళ్తున్న అక్కాతమ్ముడి చాటున దాక్కునే ప్రయత్నం చేశాడు. మరోవైపు తుపాకి చేత పట్టుకున్న వ్యక్తి కాల్పులు ఆపలేదు. ఈ క్రమంలో తన తమ్ముడిని కాపాడుకునేందుకు బుల్లెట్లకు భయపడకుండా ఆ అక్క చేసిన సాహాసం అందరినీ ఆకట్టుకుంటోంది. 

మరిన్ని వార్తలు