వీఐపీల మ్యాప్‌ వచ్చేసింది.. టక్కున సమాధానం

2 Aug, 2022 03:34 IST|Sakshi

ఈ ప్రశ్నకు మీరు బదులిచ్చినా ఇవ్వకున్నా ఒక ఆన్‌లైన్‌ ఇంటరాక్టివ్‌ మ్యాప్‌ (ప్రపంచ పటం) మాత్రం టక్కున సమాధానం చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందిన వ్యక్తులు పుట్టిన ప్రాంతాలను చిటికెలో చూపిస్తోంది. ఉదాహరణకు లండన్‌లో పుట్టిన అత్యంత ప్రముఖ వ్యక్తి ఎవరు? అని యూజర్లు అడిగితే చార్లీ చాప్లిన్‌ పేరును మ్యాప్‌ సూచిస్తోంది.

అమెరికాలోని హోనలులులో పుట్టిన గొప్ప వ్యక్తి ఎవరంటే మాజీ దేశాధ్యక్షుడు బరాక్‌ ఒబామా పేరు వస్తోంది. అలాగే భారత్‌ నుంచి టిప్పుసుల్తాన్, ఔరంగజేబు వంటి నాటి రాజులు మొదలు మహాత్మాగాంధీ, నెహ్రూ, రాజీవ్‌గాంధీ వంటి నేతల వరకు ఆయా వ్యక్తులు పుట్టిన ప్రాంతాలనుబట్టి మ్యాప్‌ చూపుతోంది. మీ ప్రాంతంలోని ప్రముఖుల వివరాల కోసం ఈ లింక్‌ను tjukanovt.github.io/notable-people క్లిక్‌చేయండి. 

గుర్తించేది ఇలా.. 
వికీపీడియా, వికీడేటాలోని సమాచా రం ఆధారంగా ప్యారిస్‌ వర్సిటీకి చెందిన పరిశోధకులు వివిధ రంగాల వ్య క్తుల ప్రాముఖ్యతను ఇటీవల లెక్కగట్టారు. దీని ఆధారంగా ప్రముఖ భూ గోళ శాస్త్రవేత్త, వార్తావెబ్‌సైట్లు, సంస్థలకు ఆన్‌లైన్‌ మ్యాప్‌లందించే మ్యాప్‌ బాక్స్‌ కంపెనీ సీనియర్‌ డిజైనర్‌ టోపీ జుకనోవ్‌ ఇంటరాక్టివ్‌ మ్యాప్‌ను రూ పొందించారు.

వికీపీడియాలో నమోదైన ఎంట్రీలు, వాటి  పొడవు, 2015 నుంచి 2018 మధ్య వికీపీడియాలో ఒక్కో ప్రముఖ వ్యక్తికి లభించిన సగ టు వ్యూయర్‌షిప్‌ తదితరాలను పరిగణనలోకి తీసుకొని ఈ మ్యాప్‌ను రూ పొందించినట్లు జుకనోవ్‌ చెప్పారు. సంస్కృతి, శాస్త్ర పరిశోధన, నాయకత్వం, క్రీడలు లేదా ఆటలు అనే నాలుగు రంగాలకు చెందిన వ్యక్తుల వివరాలను ఇందులో పొందుపరిచినట్లు చెప్పారు.  

మరిన్ని వార్తలు