ప్రపంచం కోసం 200 కోట్ల డోసులు

20 Dec, 2020 04:11 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి: కరోనా వ్యాక్సిన్‌ కోసం డబ్బు వెచ్చించలేని పేద దేశాలకు సాయం చేసేందుకు అంతర్జాతీయ వ్యాక్సిన్‌ భాగస్వామి కోవాక్స్‌ ముందుకొచ్చింది. ఐక్యరాజ్యసమితి ద్వారా ఈ వ్యాక్సిన్లను ప్రపంచ దేశాలకు అందించడానికి కోవాక్స్‌ సిద్ధమైంది. ఇందులో 2 కోట్ల డోసుల ఆస్ట్రాజెనెకా/ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌లు కూడా ఉన్నాయి. అన్ని రకాల అనుమతులు పొందిన వ్యాక్సిన్లను 2021లో దాదాపు 92 దేశాలకు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధానొమ్‌ ఘెబ్రియేసుస్‌ స్పందించారు. ప్రపంచ ఆరోగ్యంలో ఇదో మైలు రాయి అని, గొప్ప వార్త అని వ్యాఖ్యానించారు. అయితే ఇది ఇంకా ప్రారంభం కాలేదని, త్వరలోనే అవుతుందని అన్నారు. వ్యాక్సిన్‌ రేసుల్లో ముందున్న అన్ని సంస్థలతోనూ డోనార్ల ఆర్థిక సాయంతో చర్చలు జరిపి వ్యాక్సిన్లను సేకరించి, వాటిని ఐరాస ద్వారా ప్రపంచంలోని పేద దేశాలకు, ఆయా జనాభాను బట్టి అందించనున్నారు.

మరిన్ని వార్తలు