ఆండ్రాయిడ్‌ ఫోన్లలో అధికంగా డేటా సేకరణ....!

1 Apr, 2021 14:59 IST|Sakshi

ఆపిల్‌ కంటే  ఆండ్రాయిడ్ ఫోన్ల డేటానే‌ ఎక్కువ : స్టడీ

20 రెట్లు ఎక్కువ డేటా సేకరణ 

కొట్టి పారేసిన గూగుల్‌

గూగుల్  ఆండ్రాయిడ్‌ యూజర్ల  నుంచి ఎక్కువ డేటాను సేకరిస్తోందని ఒక పరిశోధనలో  తేలింది. ఈ డేటా సేకరణ ఆపిల్‌ ఫోన్ల కంటే అధికంగా ఉందని పేర్కొన్నారు.  ఐర్లాండ్‌లోని ట్రినిటీ కాలేజీకి చెందిన పరిశోధకులు గూగుల్‌ పిక్సెల్ ఫోన్ తో షేర్ చేసిన డేటాను,  ఆపిల్‌ ఐఫోన్‌ డేటాతో పోల్చారు. గూగుల్ ఆపిల్ కంటే 20 రెట్లు ఎక్కువగా హ్యాండ్‌సెట్ డేటాను సేకరిస్తుందని కనుగొన్నారు.

డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజ్‌కు చెందిన డగ్లస్ జె. లీత్ , అతని బృందం మొబైల్ హ్యాండ్‌సెట్ గోప్యతపై పరిశోధన నిర్వహించారు.  కాగా ఏ తయారీదారు ఎక్కువగా యూజర్ డేటాను సేకరిస్తుందో చూడటానికి పిక్సెల్, ఐఫోన్ మోడల్స్ పై పరిశోధనను చేపట్టగా, పిక్సెల్, ఐఫోన్ మోడల్స్ రెండూ సగటున ప్రతి 4.5 నిమిషాలకు ఆయా తయారీదారులతో డేటాను పంచుకుంటున్నాయని పరిశోధకులు కనుగొన్నారు.సేకరించిన డేటాలో ఐఎమ్‌ఈఐ నంబర్‌, హార్డ్‌వేర్ సీరియల్ నంబర్, సిమ్ సీరియల్ నంబర్ ,ఐఎంఎస్‌ఐ, హ్యాండ్‌సెట్ ఫోన్ నంబర్ మరిన్ని, టెలిమెట్రీ డేటా కూడా  ఉన్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్‌లలో యూజర్‌ సిమ్‌ను వేసినప్పుడు, గూగుల్,  ఆపిల్ కంపెనీలకు రెండింటికి వివరాలు వెళ్తాయి. అంతేకాకుండా ఐవోఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ మ్యాక్‌ అడ్రస్‌లను, జీపీఎస్‌ లోకేషన్‌ను ఆపిల్‌కు పంపుతుందని తెలిసింది. ఆపిల్ లాగిన్ కానప్పుడు కూడా యూజర్‌ లోకేషన్‌ను, అలాగే స్థానిక ఐపీ అడ్రస్‌ను సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ  రెండు ఆపరేటింగ్ సిస్టమ్‌ల నుంచి యూజర్లు  వైదొలిగినప్పటికీ  కూడా టెలిమెట్రీ డేటాను  పంపుతాయని తేలింది. ఫోన్‌ ఆన్‌ చేసిన  10 నిమిషాల్లోనే  గూగుల్ 1 ఏంబీ డేటాను సేకరిస్తుంది, ఆపిల్ 42కేబీ డేటాను సేకరిస్తుందని తెలిపారు.  అయితే ఈ  పరిశోధనను గూగల్‌ కొట్టివేసింది. పరిశోధన చేయడానికి సరైన కొలమానాలను తీసుకొలేదని గూగుల్‌ ప్రతినిధి వాదించారు.

చదవండి: యూట్యూబ్‌ కొత్త ప్రయోగం.. ఫ్యాన్స్ వార్‌కి చెక్ పెట్టనుందా?

మరిన్ని వార్తలు