గూగుల్‌తో జతకట్టిన ఎలోన్‌ మస్క్‌

14 May, 2021 20:49 IST|Sakshi

గూగుల్‌తో స్పేస్‌ఎక్స్ సంస్థ వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ జతకట్టారు. వీరిద్దరి కలయికతో ఇప్పుడు ఉపగ్రహానికి హై స్పీడ్ ఇంటర్నెట్, సురక్షిత కనెక్షన్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఎలోన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓగా వ్యవహరిస్తున్నారు. అతని శాటిలైట్-టు-ఇంటర్నెట్ సేవా సంస్థ స్పేస్‌ఎక్స్. దీనిని ‘స్టార్‌లింక్’ అని పిలుస్తారు.

స్టార్‌లింక్ ప్రపంచంలోని ఏ మూలనైనా ఇంటర్నెట్ సేవలను అందించడం సులభతరం చేస్తుంది. ప్రస్తుతం గూగుల్‌ కలయికతో ఇకపై వినియోగదారులు ఎలాంటి అంతరాయం లేకుండా అధిక వేగంతో ఇంటర్నెట్ అందించనుంది. వీరి ఒప్పందం ప్రకారం ఎలోన్ మస్క్ అంతరిక్ష అభివృద్ధి సంస్థ గూగుల్ క్లౌడ్ ద్వారా హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను ప్రారంభించనుంది. అందుకోసం స్టార్‌లింక్ ఉపగ్రహాలకు అనుసంధానించడం కోసం గూగుల్ డేటా సెంటర్లలో స్టార్‌లింక్ గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. 2021 రెండవ భాగంలో కస్టమర్లకు ఈ సేవ అందుబాటులో ఉంటుందని టెక్ దిగ్గజం తెలిపింది. ఇటీవల ఆదాయ నివేదిక ప్రకారం, గూగుల్ క్లౌడ్ వ్యాపారం మొత్తం ఆదాయంలో 7% వాటాను కలిగి ఉంది. 

( చదవండి: మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌! )

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు