వర్క్‌ ఫ్రం హోం: గూగుల్‌ లాభం ఎంతో తెలుసా?

30 Apr, 2021 19:59 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తరణను అడ్డుకునేందుకు గత ఏడాది దాదాపు ప్రపంచమంతా పూర్తి లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో చిన్నా పెద్ద కంపెనీల ఉద్యోగులందరూ ఇంటినుంచే పనిచేయాల్సి (వర్క్‌ ఫ్రం హోం) వచ్చింది. ఇది అటు ఉద్యోగులకు ఇటు  చాలా  కార్పొరేట్‌ కంపెనీలకు కలిసి వచ్చింది.  ముఖ్యంగా గూగుల్‌, ఆపిల్‌ ఫేస్‌బుక్, ట్విటర్,తదితర టెక్‌ కంపెనీలకు పలు రకాలుగా ఖర్చులు తగ్గి పెద్ద ఎత్తున ఆదాయం ఆదా అయింది. గూగుల్‌కు ఒక బిలియన్‌ డాలర్ల మేర ఖర్చు తగ్గిందట. అంటే సుమారు 7,400 కోట్ల రూపాయలను గూగుల్‌ ఆదా చేసింది. (వెయ్యి పడకలతో కోవిడ్‌ ఆసుపత్రి: రిలయన్స్‌)

బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక ప్రకారం గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ మొదటి త్రైమాసికంలో, ప్రమోషన్లు, ప్రయాణాలు,  ఎంటర్‌టైన్‌మెంట్‌ వినోదానికి సంబంధించిన  గత ఏడాదితో పోలిస్తే 268 మిలియన్లను ఆదా చేసింది, వార్షిక ప్రాతిపదికన ఒక బిలియన్లకు పైగా ఉంటుందని కంపెనీ ఫలితాల ఆధారంగా విశ్లేషకుల అంచనా.  డిజిటల్ ఈవెంట్‌ల కారణంగా 2020లో గూగుల్‌ ప్రకటనలు  ప్రచార ఖర్చులు 1.4 బిలియన్ డాలర్లు తగ్గాయని ఆల్ఫాబెట్ తెలిపింది. ప్రయాణ, వినోద ఖర్చులు  371 మిలియన్ డాలర్లు తగ్గాయి. గూగుల్ ఈ పొదుపును కొత్త వారిని ఎంపిక చేసుకునేందుకు ఉపయోగించినట్లు నివేదిక పేర్కొంది. మహమ్మారి కారణంగా సంస్థలో మార్కెటింగ్,  పరిపాలనా ఖర్చులు చాలా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే, అనేక ఇతర టెక్ కంపెనీల మాదిరిగా కాకుండా, గూగుల్ ఈ ఏడాది సెప్టెంబరులో చాలా చోట్ల తన కార్యాలయాలను తెరవ నున్నామని, ఇది ఆయాదేశాల కోవిడ్‌ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. గూగుల్ 'హైబ్రిడ్' మోడల్‌లో ఉద్యోగులు తగినంత దూరంలో కూర్చొని సేవలందిస్తారని   చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్‌లో గూగుల్ పెట్టుబడులు పెట్టడం కొనసాగుతుందని పోరాట్ చెప్పారు.

చదవండి : కరోనా విలయం: చూస్తే కన్నీళ్లాగవు: వైరల్‌ ట్వీట్‌

మరిన్ని వార్తలు