గూగుల్‌ని తిట్టిపోస్తున్న నెటిజన్లు...నివాళి ఇచ్చే పద్ధతి ఇదేనా!

5 Jul, 2022 11:14 IST|Sakshi

Google's July 4 Animation: అమెరికాలో జులై 4న స్వాతంత్య్ర దినోత్సవం రోజున జరిగిన వేడుకల్లో ఒక దుండగుడు ఇండిపెండెన్స్‌ డే పరేడ్‌ పై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తదనంతరం ఒక నెటిజన్‌ జులై 4వ తేదికి సంబంధించిన కంటెంట్‌ కోసం వెతుకుతున్నప్పుడూ...గూగుల్‌కి సంబంధించిన ప్రత్యేక సెలబ్రేషన్‌ యానిమేషన్‌ పేజీ కనిపించింది.

అది నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఐతే ఆ పేజిలో జులై 4న యూఎస్‌లో జరిగిన కాల్పులకు సంబంధించిన తాజా వార్తల పోటో లే అవుట్‌లతో పాటు కలర్‌ఫుల్‌ బాణ సంచాలతో రూపొందించింది. దురదృష్టకరమైన ఘటనలు జరిగినప్పుడూ ఇలా బాణాసంచాలతో కలర్‌ఫుల్‌గా ఇ‍వ్వకూడదు.

షికాగోలోని ఐలాండ్‌ పార్క్‌లో జరిగిన సాముహిక కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు, పైగా ప్రజలు భయంతో పరుగులు తీయడం వంటి బాధకరమైన వార్తలను ప్రజెంట్‌ చేస్తూ... రంగరంగుల బాణాసంచా కాల్పుతో  కలర్‌ఫుల్‌గా సంబరంలా ఇ‍వ్వడం పలువురికి ఆగ్రహం తెప్పించింది.

ఈ విషయమై మండిపడుతూ.. నెటిజన్లు ఫిర్యాదులు చేశారు కూడా. అంతేకాదు ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందడమే కాకుండా చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు సుమారు 24 మం‍ది ఈ ఘటనలో తీవ్రంగా గాయపడితే ఇవ్వాల్సిన నివాళి ఇదేనా! అంటూ విరుచుకుపడుతున్నారు. ఈ మేరకు సంబంధిత గూగుల్‌ యానిమేషన్‌ పేజీ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి: అమెరికాలో కాల్పులకు పాల్పడిన వ్యక్తి అరెస్టు)

మరిన్ని వార్తలు