అమెరికాలో సెటిల్‌ కావడానికి ప్లాన్‌ చేసిన గొటబయా రాజపక్స!

19 Aug, 2022 05:21 IST|Sakshi

కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయా రాజపక్స అమెరికాలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. యూఎస్‌ గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారని శ్రీలంక పత్రిక డైలీ మిర్రర్‌ వెల్లడించింది. గ్రీన్‌ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి గొట బయా అర్హుడే. ఎందుకంటే ఆయన భార్య రోమా కు అమెరికా పౌరసత్వం ఉంది.

భార్య, కుమారుడితో కలిసి అమెరికాలో స్థిరపడాలని గొటబయా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో ఓ హోటల్‌లో భార్యతో కలిసి ఉంటున్నారు. ఈ నెల 25న శ్రీలంకకు తిరిగివచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది నవంబర్‌ వరకూ థాయ్‌లాండ్‌లోనే ఉండిపోవాలని తొలుత అనుకున్నప్పటికీ స్వదేశానికి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు