జూమ్‌ లైవ్‌లో ప్రభుత్వ అధికారి శృంగారం..

27 Aug, 2020 19:48 IST|Sakshi
వీడియో దృశ్యం

మనీలా : చుట్టు పక్కల ఏం జరుగుతోందో తెలియకుండా తన సెక్రటరీతో శృంగారంలో మునిగిపోయాడో ప్రభుత్వ అధికారి. జూమ్‌ లైవ్‌లో పాడుపని చేస్తూ అడ్డంగా దొరికి పోయి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన ఫిలిప్పిన్స్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..  ఫిలిప్పిన్స్‌, ఫాతిమా దాస్‌ గ్రామ కౌన్సిల్‌ సభ్యులు పై అధికారి జీసన్‌‌ ఎస్టిల్‌తో ప్రతిరోజూ లాగే గత బుధవారం కూడా జూమ్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అయితే టెక్నాలజీ మీద అంత అవగాహన లేని జీసన్‌ తన చర్చ ముగియగానే ఒక బటన్‌కు బదులు వేరే బటన్‌ నొక్కి కెమెరా ఆఫ్‌ చేయకుండా అలానే వదిలేశాడు. అనంతరం తన సెక్రటరీతో శృంగారంలోకి దిగాడు. ( ఆత్మలతో శృంగారం.. అందుకే గర్భస్రావం!)

ఇదంతా జూమ్‌ లైవ్‌లో ఉన్నవారికి కనపడుతోందని అతడు గుర్తించలేదు. కానీ, కొద్దిసేపటి తర్వాత ఇది గమనించిన సెక్రటరీ వెంటనే అతడికి సమాచారం అందించింది. ఆ వెంటనే తేరుకున్న ఆయన కెమెరా ఆఫ్‌ చేశాడు. అయితే జూమ్‌ లైవ్‌లో ఉన్న ఓ సభ్యుడు ఆ దృశ్యాలను వీడియో తీశాడు. దీంతో వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన స్థానిక ఉన్నతాధికారులు అతడిపై చర్యలకు సిద్ధమయ్యారు. కానీ, వీడియో బయటకు విడుదలైన తర్వాత ఆ ఇద్దరూ తమ విధులకు హాజరు కాకపోవటం గమనార్హం.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా