అవునంటారా? దెయ్యంగారేనంటారా!

17 Mar, 2021 08:29 IST|Sakshi

అనగనగా లాస్‌ వేగస్‌లో (యూఎస్‌)లో ఒక బామ్మ. ఈ బామ్మకు ఒక కొడుకు. అతడికి ఇద్దరు పిల్లలు. ఇప్పటివరకు బానే ఉంది. అయితే బామ్మ మనవడు, మనవరాలు తమ గదిలో అర్ధరాత్రి దాటిన తరువాత నిద్రలోనే ఎవరితోనో మాట్లాడుతున్నారట. మొదట కల కావచ్చు అనుకున్నారట. కానీ పదే పదే  పిల్లలు నిద్రలో మాట్లాడుతుండడంతో ఆ గదిలో మోషన్‌ యాక్టివేటెడ్‌ కెమెరాను సెట్‌ చేశారు. రెండు మూడురోజుల తరువాత ఈ కెమెరాను పరిశీలించగా తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఒక ఆకారం కనిపించింది. పిల్లలు ఎవరో ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నట్లే మాట్లాడుతున్నారట గానీ భయపడడం లేదట. ఒకరోజు అయితే ఈ ఆకారం ‘బయటికి వెళ్లండి’ అని పిల్లలను గట్టిగా గద్దించిందట. బామ్మ ఈ అనుభవాన్ని ఫొటోతో సహా ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసింది. సలహా ఇవ్వమని అడిగింది.

‘మూఢనమ్మకాలను వదలండీ’ ‘మీరేదో భ్రమల్లో ఉన్నారు’ ‘ఫేక్‌ ఇమేజ్‌’ లాంటి తిట్లతో  పాటు– ‘ఇల్లు అమ్మేసి వేరే ఇంట్లోకి మారండి. 20 సంవత్సరాల ఇంట్లోకి దెయ్యాలు రావడం కొత్తేమీ కాదు’ లాంటి సలహాలు కూడా వచ్చాయి. ఒక ఆకారం ఏదో కనిపిస్తున్న ఫొటో గురించి ప్రస్తావన వస్తే–‘ఫేక్‌ ఫొటోలు సృష్టించే టెక్నికల్‌ నాలెడ్జ్‌ నాకు లేదని ఎవరిని అడిగినా చెబుతారు. పబ్లిసిటీ కోసం పాకులాడాల్సిన ఖర్మ నాకేమిటి!’ అంటోంది బామ్మ. నిజం దెయ్యమెరుగు! 

చదవండి: విమానంలో పిచ్చి చేష్టలు.. 20 ఏళ్ల జైలు, 2 కోట్ల జరిమానా!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు