94 ఏళ్ల వయస్సులో ‘సాహసం’

24 Aug, 2020 15:45 IST|Sakshi

లండన్‌ : పండు ముదుసలి. 94 ఏళ్లు. కాటికి కాళ్లు చాపుకునే వయస్సు. అత్యంత సాహసానికి ఒడిగట్టింది. తన కుటుంబ సభ్యులను కలసుకోవాలనే ఆరాటమే అందుకు కారణం. ఇది వర కే లండన్‌ చేరుకున్న తన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ఫ్రాన్స్‌ నుంచి లండన్‌లోని డోవర్‌ రేవుకు అతి చిన్న పడవలో ఇద్దరు, ముగ్గురితో కలసి బయల్దేరింది. అత్యంత ప్రమాదకరమైన ఇంగ్లీషు ఛానల్లో అతి చిన్న పడవలో డోవర్‌ రేవు చేరుకునేందుకు బయల్దేరడం అంటే దుస్సాహసమే. ఇలాంటి దుస్సాహసాలకు ఎంతో ఇప్పటి వరకు ఎంతో మంది బలైపోయారు. అయినప్పటికీ ఫ్రాన్స్‌ నుంచి ఇంగ్లండ్‌కు అక్రమ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.

94 ఏళ్ల పండు ముసలవ్వ చిన్న పడవలో ఇంగ్లీష్‌ ఛానల్‌లో 21 మైళ్లు ప్రయాణించగానే బ్రిటన్‌ గస్తీ నౌకా దళం గమనించింది. వెంటనే ఆమెను, ఆమెతో పాటు వచ్చిన మరో ఇద్దరుముగ్గురిని అదుపులోకి తీసుకొని ఒడ్డుకు చేర్చింది. 94 ఏళ్లు కలిగిన వారు ఇంత వరకు వలస వచ్చేందుకు ప్రయత్నించలేదని, బహూశ వలసకు వచ్చిన వారిలో అతి పెద్ద వయస్కురాలు ఆమెనే కావొచ్చని ఇంగ్లండ్‌ నౌకాధికారులు తెలిపారు. ఆమె పేరు వెల్లడించేందుకు వారు నిరాకరించారు. (కోమాలోకి కిమ్‌ జోంగ్‌ ఉన్‌!)

ఇతరులతోపాటు తనకు పౌరసత్వం ఇవ్వాలని డోవర్‌ ఒడ్డుకు చేరుకున్న 94 ఏళ్ల వృద్ధురాలు దరఖాస్తు చేసుకున్నారు. వృద్ధాప్యరీత్య ఆమెకు పౌరసత్వం లభించవచ్చని బ్రిటీష్‌ మీడియా అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు ఐదువేల మంది ఇంగ్లీష్‌ ఛానల్‌ ద్వారా ఫ్రాన్స్‌ నుంచి లండన్‌ వలస వచ్చేందుకు ప్రయత్నించారని బ్రిటీష్‌ అధికార వర్గాలు తెలిపాయి.

చదవండి: ‘ఇంటి నుంచి పని’లో పదనిసలు

మరిన్ని వార్తలు