అద్భుత అందాలకు నెలవు గ్రెనెడా

17 Oct, 2020 18:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అందమైన పర్యతాలకు, అద్భుతమైన లోయలకు, వర్షాలకు కొదవలేని దట్టమైన అడువులకు నెలవు గ్రెనడా. ఆకర్షణీయమైన బీచ్‌లకు, వెండి వలె మెరిసే ఇసుక తిన్నెలకు, సుగంధ ద్రవ్యాలకు కొలవు గ్రెనడా, హొయలొలికించే సముద్ర తీరాలకు సమీపంలో కొలువైన ఆహ్లాదకర హాలిడే రిసార్ట్స్‌కు కొదవ లేదు. అన్ని హంగులు కలిగిన గ్రెనడాకు సాటి వచ్చే మరో కరేబియన్‌ దేశం లేదంటే నమ్మక తప్పదు. 

సుగంధ ద్రవ్యాల దీవిగా ఖ్యాతికెక్కిన గ్రెనడాకు అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌ జోక్యంతో, బ్రిటీష్‌ ప్రధాని మార్గరెట్‌ థాచర్‌ ప్రమేయంతో బ్రిటీష్‌ పాలన నుంచి స్వాతంత్య్రం లభించింది. గ్రెనడా రాజధాని నగరం సెయింట్‌ జార్జ్‌ విస్తీర్ణంలో బార్బొడోస్‌ అంత ఉన్నప్పటికీ జన సాంద్రత మాత్రం తక్కువే. బార్బొడోస్‌లో మూడు లక్షల మంది నివసిస్తుండా సెయింట్‌ జార్జ్‌ నగరంలో దాదాపు లక్ష మందే నివసిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా ప్రశంసలు అందుకుంటోన్నా గ్రెనడా జాజికాయ ఎగుమతిలో ప్రపంచంలోనే రెండవ పెద్ద దేశం. 

ఫల పుష్పాలతోపాటు ప్రకృతి సిద్ధమైన జలపాతాలతో పర్యాటకులను ఆకర్షించే గ్రెనడాను చైసిన వారు ‘గాడ్‌ ఈజ్‌ గ్రెనేడియన్‌’ అనక మానరు. పామ్‌ ట్రీస్‌ ఎక్కువగా కనిపించే ఈ దీవిపైన విలాసవంతమైన అతిథులకు, వేసవి విడిదులకు కొరత లేదు. ఒక బ్రిటన్, అమెరికా దేశాల నుంచే రోజుకు దాదాపు 70 మంది పర్యాటకులు ఆదేశాన్ని సందర్శిస్తారు. ఈ రెండు దేశాలతోపాటు పలు దేశాల నుంచి గ్రెనడాకు ఇప్పుడు నేరుగా విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో సమూహాల నుంచి సామాజిక దూరాన్ని కోరుకునే ప్రజలు పర్యాటకులుగా ఈ దేవిని ఎక్కువగా సందర్శిస్తున్నారు. 

వెండిలా మెరుస్తుండే ఇసుక బీచుల్లో పాద రక్షలు లేకుండా నడవడం మరచిపోలేని ఓ మధుర అనుభూతి. ఆరోగ్యంతోపాటు అహ్లాదాన్ని కలిగించే 101 మీటర్ల పొడవైన స్మిమ్మింగ్‌ ఫూల్‌ గురించి విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. కరేబియన్‌ దీవుల్లో మరెక్కడా అంత పొడవైన స్విమ్మింగ్‌ పూల్‌ లేదు. ఎప్పుడూ నవ్వుతుండే స్థానిక ప్రజలను చూస్తుంటే వారి జీవితాలు ఎంత సంతృప్తిగా గడచి పోతున్నాయో అర్థం అవుతుంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా