వర్క్‌ ఫ్రం హోమ్‌.. రియాలిటీ ఇదే

17 Sep, 2020 12:19 IST|Sakshi

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో నేడు పని సంస్కృతిలో భారీ మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అంటే కేవలం సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో మాత్రమే ఉండేది. కానీ నేడు దాదాపు అన్ని రంగాల్లో ఇంటి నుంచే పని తప్పనిసరి అయ్యింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అంటే మగవారికి అదనపు లాభాలుంటాయి. కానీ మహిళల పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదు. రెడీ అవ్వడం తప్పుతుంది అంతే. ఇప్పటికే చాలా మంది సోషల్‌ మీడియాలో వర్క్‌ ఫ్రం హోం ఎక్స్‌పెక్టెషన్స్‌ వర్సెస్‌ రియాలిటీ అంటూ ఫోటోలు షేర్‌ చేస్తున్నారు. తాజాగా ఓ అమెరికన్‌ సైంటిస్ట్‌ షేర్‌ చేసిన ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. గ్రెట్చెన్‌ గోల్డ్‌మాన్‌ అనే మహిళ శాస్త్రవేత్తగానే కాక పీహెచ్‌డీ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఫెడరల్‌ క్లైమెట్‌ చేంజ్‌ లీడర్‌షిప్‌ గురించి మాట్లాడటానికి సీఎన్‌ఎన్‌ టీవీలో కనిపించారు. ఈ కార్యక్రమంలో ఆమె మస్టర్డ్‌ కలర్‌ కోటు ధరించి.. డ్రాయింగ్‌ రూమ్‌లో నిల్చుని మాట్లాడారు. ఆమె వెనక కుటుంబ సభ్యుల ఫోటోలు, చక్కగా అమర్చిన సోఫాలు కనిపించాయి. అయితే ఇదంతా టీవీలో కనిపించిన దృశ్యాలు. (చదవండి: ‘ఇంటి పనే’ ఇద్దాం!)

కానీ వాస్తవంగా ఉ‍న్న పరిస్థితులకు సంబంధించిన ఫోటోను షేర్‌ చేశారు గోల్డ్‌మాన్‌. దీంట్లో పిల్లలు ఆడుకునే బొమ్మలన్ని నేల మీద చిందరవందరగా పడి ఉన్నాయి. టేబుల్‌ మీద చైర్‌ పెట్టి.. దాని మీద ల్యాప్‌టాప్‌ పెట్టింది. అన్నింటికి మించి హైలెట్‌ ఏంటంటే షార్ట్‌ మీద బ్లెజర్‌ ధరించింది గోల్డ్‌మాన్‌. అయితే ఇవన్ని కనిపించకుండా ఆమె ఎలా మ్యానేజ్‌ చేసింది. కెమరాను ఏ యాంగిల్‌లో పెట్టింది అనే దాని గురించి మాత్రం వెల్లడించలేదు. నేను నిజాయతీగా ఉండాలనుకుంటున్నాను అనే క్యాప్షన్‌తో టీవీలో కనిపించిన ఫోటోని.. రియల్‌ ఇమేజ్‌ని ట్వీట్‌ చేసింది గోల్డ్‌మాన్‌. ప్రస్తుతం ఈ ట్వీట్‌ తెగ వైరలవుతోంది. చాలా మంది దీనికి కనెక్ట్‌ అయ్యారు. (చదవండి: ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్’‌లో ఆదాయమెంతో తెలుసా..!)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు