ఫోటోగ్రాఫర్‌లు వెంటపడటంతోనే అలా చేశా.....!: గ్రిమ్స్‌

4 Oct, 2021 17:14 IST|Sakshi

హాట్‌ టాపిక్‌గా మారుతుందనే అలా చేశా

న్యూయార్క్‌: ప్రముఖులు, సెలబ్రెటీలు, బయట ఎక్కడైన కనిసిస్తే చాలు సెల్ఫీలంటూ అభిమానులు, ఫోటోగ్రాఫర్‌లు వెంటపడటం సదా మామాలే. పాపం వాళ్లమో వీటి నుంచి ఎలా తప్పించుకోవాలో అని నానా తంటాలు పడుతుంటారు. కానీ అందుకు విరుద్ధంగా ఇక్కడ ప్రసిద్ధ కెనడియన్‌  గాయని, ఎలెన్‌ మస్క్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ గ్రిమ్స్‌ ఫోటో గ్రాఫర్లకు ఝలక్‌ ఇవ్వాలనే ఆవిధంగా ఫోజు ఇచ్చానంటుంది. అసలేం జరిగిందా అనే కదా!

(చదవండి: పుట్టుకతోనే చేతుల్లేవు.. కానీ చాలానే సాధించింది!)
వివరాల్లోకెళ్లితే....అపర కుభేరుడు టెస్లా సీఈవోగా అంతకు మించి స్పేస్‌ ఎక్స్‌ లాంటి ప్రైవేట్‌ ఏజెన్సీ ఓనర్‌గా అందరికీ సుపరిచితుడై ఎలన్‌ మస్క గర్ల్‌ ఫ్రండ్‌ అనో కవర్‌ మ్యాగ్‌జైన్‌ స్టోరీ కోసం లేక ప్రసిద్ధ కెనడియన్‌ గాయని కావడంతోనే ఆమె వెంట ఫోటోగ్రాఫర్లు తెగ వెంటపడుతుంటారు. దీంతో విసుగు చెందిన గ్రిమ్స్‌ లాస్‌ ఏంజెల్స్‌ వీధుల్లో ఒక చోట జర్మనీకి చెందిన తత్వవేత్త కార్ల్ మార్క్స్‌ పుస్తకం చదువుతున్నట్లుగా ఫోజు ఇస్తూ తిరుగుతుంటుంది. పైగా  ఆ ఫోటోను ట్విట్టర్‌లో కూడా షేర్‌ చేసింది.

అయితే ఆ పుస్తకం 1848 ఏళ్ల నాటి కమ్యూనిస్టు ప్రణాళిక, పెట్టుబడిదారీ సమాజంలో 'వర్గ పోరాటం' కు సంబంధించిన కార్లమార్క్స్‌ పుస్తకం కావడం విశేషం. ఈ క్రమంలో ఎలెన్‌ మస్క్‌కి దూరంగా ఉంటున్న ఈ సమయంలో  ప్రజల్లో ఇది హాట్‌ టాపిక్‌గా మారి చర్చనీయాంశంగా మారుతుందనే తాను అలా చేశానంటోంది. ఆ పుస్తకం చదువుతున్న ఫోటో ఫిక్‌ తోపాటు సందేశాన్ని జోడించి మరీ ట్విట్టర్‌లో మరో పోస్ట్‌ పెట్టింది.

ప్రస్తుతం ఇది కాస్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ మేరకు తాను కమ్యూనిస్ట్‌వాదిని కానని, తాను ఎలెన్‌మాస్క్‌ ఇప్పటికీ  కలిసే ఉంటున్నామంటూ కూడా ట్వీట్‌ చేసింది. గత నెలలో ఎలెన్‌ మాస్క్‌ తన గర్లఫ్రెండ్‌ గ్రిమ్స్‌తో విడిపోయాడంటూ రకరకాలు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  ఎలెన్‌ మస్క్‌ కూడా గత నెల 'పేజ్‌ సిక్స్‌' అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో తాము తమ పననుల్లో  బిజీగా ఉండి దూరంగా ఉన్నామే తప్ప కలిసే ఉంటున్నామంటూ చెప్పడం గమనార్హం.

(చదవండి: ఓల్డ్‌ కార్‌ సీట్‌ బెల్ట్‌తో బ్యాగ్‌లు)

మరిన్ని వార్తలు