ఈ పెయింటింగ్ ఖరీదు ఎంతో తెలుసా?

9 Mar, 2021 19:57 IST|Sakshi

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ గర్ల్ ఫ్రెండ్ సింగర్ గ్రైమ్స్ ఇటీవల ఒక కళా ఖండాన్ని వేలం వేశారు. సింగర్ గ్రైమ్స్ వేసిన పెయింటింగ్ మార్స్ ను ఓ బేబీ కాపాడుతున్నట్లు ఉంది. అయితే, తన డిజిటల్ ఆర్ట్ వర్క్ ను గ్రైమ్స్ వేలం వేయగా మిలియన్ల డాలర్లు ఆమె దక్కించుకున్నారు. అయితే ఆమె తన కళా ఖండాన్ని క్రిప్టో కరెన్సీలో అమ్మటం మరో విశేషం. ట్విట్టర్లో తమ ఆర్ట్ వర్క్ ను వేలానికి పెడుతున్నట్టు గ్రైమ్స్ ట్వీట్ చేసిన 20 నిమిషాల్లో 5.8మిలియన్ డాలర్ల(రూ.42 కోట్ల)కు అమ్ముడైపోయింది. ప్రస్తుత క్రిప్టో ఆర్ట్ మార్కెట్ విలువ వంద మిలియన్ డాలర్ల పైమాటే. 

అయితే, ఈ డిజిటల్ లోని బేబీ ఎలాన్ మస్క్, గ్రైమ్స్ కు కలిగిన సంతానాన్ని పోలి ఉండటంతో బాగా వైరల్ అయ్యింది. గ్రైమ్స్ గత కొంతకాలంగా ఎన్ఎఫ్టీ ప్లాట్ ఫారంలో ఆర్ట్ పీసులను సింగర్ అయిన తన సోదరుడితో కలిసి అమ్ముతున్నారు. తన ఆదాయంలో కొంత భాగాన్ని కార్బన్ 180కి విరాళంగా ఇవ్వనున్నట్లు గ్రైమ్స్ ఇప్పటికే వెల్లడించారు. ఇది లాభాపేక్షలేని సంస్థ. కార్బన్ 180 కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కృషి చేస్తుంది. గ్రైమ్స్ భాగస్వామి ఎలోన్ మస్క్ కూడా ఇదివరకే కార్బన్ ఉద్గారాలను తగ్గించడం గురించి బహిరంగంగా మాట్లాడారు. ఇప్పటికే "డెత్ ఆఫ్ ద ఓల్డ్" అనే మరో ఆర్ట్ పీస్ ను గ్రైమ్స్ సుమారు 4,00,000 డాలర్లకు విక్రయించారు. ఎన్ఎఫ్టీ ద్వారా భారీగా ఆదాయం ఆర్జిస్తున్న వారిలో ఈమె కూడా ఒకరు కావటం విశేషం.

చదవండి:

ట్రాఫిక్ చలానా తగ్గించుకోండిలా!

మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్

మరిన్ని వార్తలు