సర్‌ప్రైజ్‌: ప్రతి ఒక్కరిని ఏడిపిస్తున్న వీడియో

19 Oct, 2020 18:04 IST|Sakshi

న్యూఢిల్లీ: పెళ్లిలో వధువుకు వరుడు ఇచ్చిన సర్‌ప్రైజ్‌ ప్రతి ఒక్కరిని హృదయాలను హత్తుకుంటుంటోంది. డౌన్స్‌ సిండ్రోమ్‌(జన్యు సంబంధిత వ్యాధితో బాధపుడుతున్న) చిన్నారులను పెళ్లిలో రింగ్‌ బేరర్లుగా ఉంచిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో పెళ్లి కూతురితో పాటు నెటిజన్లను సైతం కంటితడి పెట్టిస్తోంది. జానా హిషమ్‌ అనే ట్విటర్‌ యూజర్‌ సోమవారం ఈ వీడియోను షేర్‌ చేసింది. దీనికి ఆమె ‘పెళ్లి కూతురిని ఆశ్చర్యపరచడానికి పెళ్లి కుమారుడు డౌన్స్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్న విద్యార్దులను రింగ్‌ బేరర్లుగా ఉంచాడు. ఇది చూడగానే ఒక్కసారిగా వధువు నా కళ్లలో నీళ్లు తిరగాయి’ అంటూ ఆమె షేర్‌ చేసింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు లక్షల్లో వ్యూస్‌ వందల్లో కామెంట్స్‌ వచ్చాయి. జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె విద్యార్థులను రింగ్‌ బేరర్లు నియమించిన ఈ వీడియో నెటిజన్‌లను తెగ ఆకట్టుకుంటోంది. (చదవండి: మిమ్మ‌ల్ని చూసి ఎంతో గ‌ర్వ‌ప‌డుతున్నాం)

పెళ్లి కూతురికి ఇలా సర్‌ప్రైజ్‌ ఇచ్చిన పెళ్లి కొడుకుపై నెటిజన్‌లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘ఈ జంట ఎప్పటికి ఆశ్వీర్వదించబడాలి’, ‘కన్నీళ్లు ఆగడం లేదు’, ‘ఇంతకంటే మంచి వీడియోను ఈ మధ్య కాలంలో చూడలేదు’ అంటూ నెటిజన్‌లు భావోద్యేగానికి లోనవుతున్నారు. రెండు నిమిషాలకు పైగా నిడివి గల ఈ వీడియోలో నూతన వధువరుల వైపు కొంతమంది చిన్నారులు తోడిపెళ్లి కూతురు, పెళ్లి కొడుకు దుస్తులు ధరించి ఉన్నారు. వారు జంటలుగా వారి వైపు నుడుచుకుంటు రింగ్‌ను తీసుకురావడం చూసి పెళ్లి కూతురు ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. ఆమె కన్నీరు పెట్టుకుంటూ పెళ్లి కొడుకును హత్తుకుంది. ఎందుకంటే ఆ పిల్లలు అంతా డౌన్‌ సిండ్రోమ్‌ వ్యాధితో బాధపడుతున్న వారే. ఈ చిన్నారులంతా సదరు వధువు విద్యార్థులు. పెళ్లి కూతురిని సర్‌ప్రైజ్‌ చేసేందుకు పెళ్లి కొడుకు వారిని రింగ్‌బేరర్లుగా నియమించాడు. అయితే ఇది ఏప్రిల్‌ నాటి వీడియో అని తెలుస్తోంది. ఈ పెళ్లి ఎక్కడ జరిగింది, వధూవరులు ఎవరు అనే వివరాలు లేనప్పటికీ.. ఈ వీడియోలోని భావోద్వేగానికి వీక్షకులు కనెక్ట్‌ అవుతున్నారు.
(చదవండి: సింగపూర్‌ సూపర్‌ పెంటహౌజ్‌ అమ్మకం)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా